అంతరిక్షంలో వింత : సూర్యుడికి బాగా దగ్గరగా భూమి

Submitted on 3 January 2019
Earth closest to sun on January 2-3, 2019 | another novelty space | 10TV

హైదరాబాద్ : అంతరిక్షంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా మరో వింత చోటు చేసుకోనుంది. సూర్యుడికి బాగా దగ్గరగా భూమి వెళితే ఏమవుతుంది ? అబ్బో ఏమైనా ఉందా ? అని నోరెళ్లవెళ్లబెడుతరు కదా..కానీ అలాంటి వింతే జరుగబోతోంది. 2019, జనవరి 03వ తేదీన భూమి..సూర్యుడికి బాగా దగ్గరగా రానుంది. ఈ వింతకు ‘హెరిహిలియన్’గా పేరు పెట్టారు. ఇలా జరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఏమైనా వస్తాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే...వీటిని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు.

సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది. ఇక్కడ సూర్యుడికి సమీపంగా..మరోసారి సూర్యుడికి దూరంగా వెళుతూ ఉంటుంది. జనవరి 3వ తేదీన మాత్రం భూమి..సూర్యుడికి సమీపంగా రానుంది. ప్రతి సంవత్సరం ఇలాంటి వింత చోటు చేసుకుంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ వింతను విద్యార్థులకు చూపించొచ్చని..అదే విధంగా బోధించడానికి కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Earth closest
sun
Earth swings
Northern Hemisphere
solstice
ellipse

మరిన్ని వార్తలు