ఏపీలో నకిలీ ఎరువుల కలకలం 

Submitted on 11 January 2019
Duplicate fertilizers in AP

అమరావతి : సర్వం నకిలీమయం అయింది. కాసులకు కక్కుర్తి పడుతున్నారు. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే పరమావధిగా భావిస్తున్నారు. ’కాదేది కవితకనర్హమన్నట్లు’.. కాదేది నకిలీకనర్హమన్నట్లుగా చేస్తున్నారు. ఏపీలో నకిలీ ఎరువులు కలకలం సృష్టించాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలో నకిలీ ఎరువుల భాగోతం బయటపడింది.

త్రిపురాంతకం, చీరాల, మార్కాపురం, డోర్నాలలో విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. 2 వేలకు పైగా నకిలీ ఎరువుల బస్తాలను అధికారులు సీజ్ చేశారు. మైసూర్ నుంచి కృష్ణపోర్టుకు నకిలీ ఎరువులు వెళ్తుండగా అధికారులు గుర్తించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని నలుగురు ఎరువుల షాప్ యాజమానులపై క్రమినల్ కేసు నమోదు చేశారు. 
 

Duplicate fertilizers
AP
guntur
prakasham

మరిన్ని వార్తలు