అదృష్టం వెన్నంటే ఉంటే : రెండు బాంబు దాడుల నుంచి బతికి బయటపడ్డాడు

Submitted on 29 April 2019
Dubai Man Survived twice luckily SriLanka Terror Attacks As well as 26/11 in Mumbai attacks

తెలుగులో ఓ సామెత ఉంది.. శివుడు ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు అని.. మరో సామెత కూడా ఉంది.. భూమి మీద నూకలు ఉన్నాయి.. అందుకే బతికి బయటపడ్డాడు అని.. ఇది ఇప్పుడు అక్షరాల నిజమైంది. దుబాయ్ కు చెందిన ఇద్దరు భారతీయ దంపతులు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో లక్కీగా ప్రాణాలతో బయటపడ్డారు. దంపతుల్లో దుబాయ్ వ్యక్తి.. బాంబు పేలుళ్ల ఘటనల నుంచి సురక్షితంగా బయటపడటం ఇది రెండోసారి.
Also Read : గిఫ్ట్ విసిరికొట్టాడు : పక్కనే పెళ్లికూతురు.. PUBGతో పెళ్లికొడుకు ఫుల్ బిజీ

ముంబైలో ఒకసారి.. లంకలో మరోసారి :
2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో అభినవ్ అనే ఈ వ్యక్తి లక్కీగా బతికి బయటపడ్డాడు. దాదాపు 11ఏళ్ల తర్వాత శ్రీలంక జరిగిన ఉగ్రదాడుల్లో మరోసారి ప్రాణాలతో బయటపడ్డాడు. రెండు సార్లు దేవుడే అభినవ్ ను కాపాడి ఉంటాడు. లేదంటే.. అంతమంది పేలుళ్లలో ప్రాణాలు కోల్పోతే.. ఇతగాడు మాత్రం లక్కీగా ఎస్కేప్ కావడం నిజంగా దేవుడి దయవల్లనే అని అనుకోకుండా ఉండలేరు. అభినయ్ చారి, ఆయన భార్య నవరూప్ కె.చారి శ్రీలంకలో బిజినెస్ ట్రిపుకు వెళ్లారు. కొలంబోలోని సిన్నామన్ గ్రాండ్ హోటళ్లలో బస చేశారు. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న ఎనిమిది దాడుల్లో ఈ హోటల్ ఒకటి.

పేలుళ్ల సమయంలో అక్కడే అభినవ్ :
అదృష్టవశాత్తూ ఈ హోటల్లో బస చేసిన అభినవ్ దంపతులు ఈస్టర్ సండే రోజున బ్రేక్ ఫాస్ట్ చేసినట్టు గల్ఫ్ న్యూస్ నివేదించింది. అభినవ్, నవరూప్ ఇద్దరు దుబాయ్ లోనే పుట్టిపెరిగారు. యూఏఈ నుంచి రెండు సార్లు విదేశీ టూర్ కు వెళ్లారని, అదే సమయంలో వారు ఉన్న ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగాయని ఏజెన్సీ తెలిపింది. 2008 నవంబర్ 26న ముంబైలో అభినవ్ అక్కడే ఉన్నారు. అదే రోజున ఉగ్రదాడులు జరిగాయి. ‘ముంబైలో మెడిసిన్ చదువు తున్నాను. బాంబు దాడులు జరిగిన సమయంలో ఐదు ఆరు రోజుల పాటు చాలా ఇబ్బందులు పడ్డాను’ అని అభినయ్ చెప్పుకొచ్చారు.

ఆ రోజు ఈస్టర్ సండే.. చర్చికి వెళ్లాం :
ఇటీవల శ్రీలంకలో జరిగిన బాంబు దాడుల గురించి అభినవ్ ప్రస్తావిస్తూ.. ‘ఆరోజు ఈస్టర్ సండే. చర్చికి మేమిద్దరం వెళ్లాం. మధ్యలో అక్కడి ప్రీస్ట్ ఓ ప్రకటన చేశారు. చర్చి ప్రాంగణం నుంచి వెంటనే అందరూ విడిచివెళ్లాల్సిందిగా కోరారు. మేం వెంటనే చర్చి నుంచి ట్యాక్సీలో బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు వెళ్లాం. ఆ తర్వాత నేరుగా తిరిగి హోటల్ కు వెళ్లిపోయాం’ అని తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపాడు. శ్రీలంకలో జరిగిన వరుస ఉగ్రదాడుల్లో 250 మందికి పైగా మృతిచెందగా, 500 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read : నుబియా Red Magic 3 : ఈ స్మార్ట్ ఫోన్లలో కూలింగ్ ఫ్యాన్

Dubai Man
SriLanka Terror Attacks
26/11 in Mumbai attacks
Abhinay Chari
Navroop K Chari
Dubai Couple

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు