జూబ్లీహిల్స్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం : దంపతుల అరెస్టు

Submitted on 18 June 2019
Drugs again in Hyderabad Jubilee Hills : two arrest

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మళ్లీ డ్రగ్స్ కలకలం రేపింది. వ్యభిచార గృహంలో డ్రగ్స్ అమ్ముతున్న దంపతులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 9 గ్రాముల కొకైన్, రూ.3లక్షల నగదు, స్వైపింగ్ మిషన్ ను ఎక్సైజ్ శాఖ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఫహద్, సలీమ భార్యభర్తలు. హైదరాబాద్ లో నివాసముంటున్నారు. కొంతకాలంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఖరీదైన కొన్ని గదులను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వ్యభిచారానికి వచ్చే కస్టమర్స్ కు డ్రగ్స్ పరఫరా చేస్తున్నారు. వీరిద్దరు ఈ దందా కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

పక్కా ప్రణాళికలతో ఎక్సైజ్ శాఖ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వారిపై దాడులు నిర్వహించారు. షేక్ ఫహద్ తోపాటు అతని భార్య సలీమను అరెస్టు చేశారు. వీరి నుంచి 9 గ్రాముల కొకైన్, 3 లక్షల రూపాయల నగదు, రెండు కార్లు, స్వైపింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. 

జూన్ 2, 2019వ తేదీ సంతోష్, మహ్మద్ మసూద్ అనే ఇద్దరి నుంచి 7 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలు షేక్ ఫహద్, సలీమ హైదరాబాద్ లో తిష్ట వేసి వ్యభిచార ముఠాను నడిపిస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వ్యభిచారానికి వస్తున్న వారందరూ రెండు, మూడు సంవత్సరాలుగా డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్ మూలాలను కూడా బయటకు తీసిన సంగతి తెలిసిందే. అయితే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కొంతకాలంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నా.. స్థానిక పోలీసులు దృష్టి సారించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. 

ఎంతమందికి డ్రగ్స్ విక్రయించారు? ఎవరెవరు కస్టమర్లు ఉన్నారు? వీరిద్దరి వెనకాల అసలు సూత్రధారులు ఎవరున్నారన్న కోణంలో విచారణ చేస్తున్నారు. పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. నిందితులిద్దరిని రిమాండ్ కు తరలించనున్నారు. 
 

Drugs
Hyderabad
Jubilee Hills
Two
Arrest


మరిన్ని వార్తలు