దొరసాని : ప్రీ-లుక్

Submitted on 25 May 2019
Dorasaani Pre-Look

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, డా.రాజశేఖర్, జీవితల చిన్న కూతురు శివాత్మికలను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో, మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్న సినిమా.. దొరసాని.. యదార్థ సంఘటనల ఆధారంగా, చక్కటి ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న దొరసాని ప్రీ-లుక్ రిలీజ్ చేసింది చిత్రబృందం.

హీరో, హీరోయిన్ల చేతివేళ్ళు టచ్ అవుతున్న లుక్ ఆకట్టుకునేలా ఉంది. హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేలా అతని చేతికి పెయింట్ మరకలు ఉన్నాయి.  ప్రేయసికి ప్రియుడు రాసిన ప్రేమలేఖ లాంటి కవిత్వం బ్యాగ్రౌండ్‌లో కనిపిస్తుంది. ఓ ధనిక వర్గానికి చెందిన అమ్మాయి, ఓ పేధ కుర్రాడి ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. మే 30న దొరసాని ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, ఎడిటింగ్ : నవీన్ నూలి, రచన-దర్శకత్వం : కెవిఆర్ మహేంద్ర.

Anand Deverakonda
Shivathmika Rajashekar
Prashanth R Vihari
kvrmahendra

మరిన్ని వార్తలు