కొత్త ఆప్షన్ : రైలు టికెట్ బదిలీ చేసుకోవచ్చు

Submitted on 22 March 2019
Dont Worry..You Can Transfer Your Reserved Train Ticket To Another Person

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీరు రైల్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత మీ ప్రయాణం ప్లాన్‌ మారిందా? మీరు బుక్‌ చేసుకున్న టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోకుండా మరొకరికి బదిలీ చేయాలనుకుంటున్నారా? ఇది సాధ్యమే. మీరు బుక్ చేసుకున్న టికెట్లను వేరొకరికి బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది IRCTC.
Read Also : ఇ-ఆటోలు ప్రవేశపెట్టనున్న హైదరాబాద్ మెట్రో

ప్రయాణం చేయడం కుదరని సమయంలో టికెట్‌ను వేరొకరికి మార్చుకునే అవకాశం కల్పించింది ఇండియన్ రైల్వే.. రిజర్వ్‌డ్‌ టికెట్‌ను బదిలీ చేయాలనుకున్న ప్రయాణికుడు.. రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు చీఫ్‌ రిజర్వేషన్‌ సూపర్‌వైజర్‌ను కలిసి దరఖాస్తు సమర్పించాలి. టికెట్‌ను ఎవరికి బదిలీ చేస్తున్నారు.. వారితో ఉన్న సంబంధం ఏమిటో తెలియజేస్తూ ధ్రువపత్రాల నకలు సమర్పించాలి. వీటిని పరిశీలించి సరైనవైతే.. పాత టికెట్‌పై పేరు మారుస్తారు. కొత్తగా టికెట్‌ ఇవ్వరు.

* రైలు టికెట్‌పై పేరు మార్చుకునేందుకు ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వాలి....
- రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే రైల్వే ఆఫీసుకు వెళ్లాలి. 
మీ దగ్గరలోని రైల్వే రిజర్వేషన్‌ ఆఫీసులో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. 
- పాసింజర్‌ కుటుంబానికి మాత్రమే ఈ టికెట్‌ను బదిలీ చేస్తారు. కుటుంబం అంటే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కూతురు, భర్త, భార్య మాత్రమే. మిగతా ఎవరికీ టికెట్లను బదలాయించదు IRCTC.
- రైల్వే రిజర్వేషన్‌ ఆఫీసుల్లో రైలు టిక్కెట్‌పై పేరు మార్చడంతో పాటు బోర్డింగ్‌ స్టేషన్‌ కూడా మార్చొచ్చు.
- పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లలో బుక్‌ చేసుకున్న టిక్కెట్లకు ఏ నిబంధనలు ఉంటాయో ఈ టికెట్‌కూ అవే నిబంధనలు వర్తిస్తాయి.
- మీరు మీ రైలు టిక్కెట్‌ను మీ కుటుంబ సభ్యులకు బదిలీ చేయాలనుకుంటే, ఎలక్ట్రానిక్‌ రిజర్వేషన్‌ స్లిప్‌ ప్రింట్‌తో పాటు ఒరిజినల్‌ ఫోటో ID కార్డు తీసుకెళ్లాలి. ఎవరి పేరుకు బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్యాసింజర్‌కు మీకు ఉన్న సంబంధాన్ని ధృవీకరించే ప్రూఫ్‌ ఏదైనా ఉండాలి.
Read Also : జై చంద్రబాబు అంటున్న రామ్ గోపాల్ వర్మ

Reserved Train Ticket
To Another Person
Indian Railway
2019

మరిన్ని వార్తలు