టార్గెట్ బాబు : లోకేష్ అనొద్దు..పప్పు అనండి - వల్లభనేని వంశీ

Submitted on 15 November 2019
Don't say Lokesh Vallabhaneni Vamsi

లోకేష్ అనొద్దు..పప్పు అనండి..అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా..ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నా..నేనేమన్నా పప్పా..పార్టీలో వంశీలాంటి వ్యక్తులు వెళ్లిపోతే..పార్టీకి ఏమీ నష్టం లేదని లోకేష్ అన్నాడని, కానీ పప్పు లాంటి వ్యక్తి బరువు మోయలేక పడవ మునిగిపోతుందని ఎద్దేవా చేశారు. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

పార్టీలో ఉన్నప్పుడు కేసులు పెట్టినా మాట్లాడలేదు..గతంలో ఎనాడూ కామెంట్స్ చేయలేదన్నారు. తాను ఇప్పుడు మాట్లాడుతుంటే..కేసులు, ఆస్తుల కోసం భయపడ్డానని కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు..పార్టీ వ్యక్తులు వారే రాస్తున్నారని చెప్పడం జరిగిందని..విన్నప్పుడు తనకు బాధ కలగదా ? అని నిలదీశారు వంశీ. 

ఎన్నికల్లో తనతో పాటు ఎంతో మందికి పార్టీ డబ్బులు ఇస్తుందని, వ్యక్తిగతంగా ఇచ్చారా ? అంటూ ప్రశ్నించారు. నిధుల గురించి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయలేమనే భయం లోకేష్ ఉందని, శ్రీకాకుళం, రామ్ నగర్ కుట్ర కేసులు ఎవరికైనా తెలుసా ? అని ప్రశ్నించారు. రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞత లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంపై స్పందించారు. తనకు మోజు లేదని, మంత్రి కావాలనే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ. 
Read More : రేపే విడుదల! : చింతమనేనికి బెయిల్

Dont
SAY
Lokesh
Vallabhaneni Vamsi

మరిన్ని వార్తలు