మా వ్యవహారాల్లో వేలు పెట్టొద్దు.. టర్కీకి భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Submitted on 15 February 2020
Don't Interfere, Says India After Turkey President Speaks On J&K In Pak

టర్కీష్ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగాన్ జమ్మూ కశ్మీర్‌పై కామెంట్లు చేసి చివాట్లు తిన్నాడు. శుక్రవారం పాకిస్తాన్‌లో పర్యటించిన ఎర్డోగాన్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్ విషయంలో ఏదైనా సహాయం కావాలంటే పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా టర్కీ ఉంటుందని మాటిచ్చారు. జమ్మూ కశ్మీర్‌పై టర్కీ ప్రెసిడెంట్  చేసిన వ్యాఖ్యలకు.. టర్కీ-పాకిస్తాన్ ఇచ్చిన జాయింట్ డిక్లరేషన్‌పై భారత్ స్పందించింది. 

' భారత్‌కు ఏ మాత్రం సంబంధం లేని వాళ్లు జమ్మూ కశ్మీర్‌ అంశంలో సహాయం చేస్తామంటే తిరస్కరిస్తున్నాం. టర్కీష్ నాయకులకు కూడా ఇదే చెప్తున్నాం. భారత అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని అంటున్నాం. వ్యవహారాలను సరిగ్గా అర్థం చేసుకునేలా తయారవ్వండి. పాకిస్తాన్ టెర్రరిజంతో ప్రాణాలు పోతున్నాయని తెలుసుకోవాలి' అని విదేశాంగశాఖ వెల్లడించింది. 

కశ్మీర్ అంశంపై టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ మాట్లాడుతూ.. 'మన కశ్మీరీ సోదరులు, సోదరీమణులు దశాబ్ద కాలంగా అసౌకర్యంతో బాధపడుతున్నారు. ఇటీవల నెలకొన్న పరిస్థితులకు ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇవాళ కశ్మీర్ అంశం పాకిస్తాన్ చేతిలో ఉంది. హుందాతనంగా న్యాయం జరగాలని అందరూ ఆశిస్తున్నారు' అని ఆయన అన్నారు. 

టర్కీ కశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటుందని మాటిచ్చారు. కశ్మీర్ తీర్మానంపై న్యాయం, శాంతి వచ్చే వరకూ తామెప్పుడూ వెనుకాడమన్నారు. గతేడాది సెప్టెంబరులోనూ జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో టర్కీ ప్రెసిడెంట్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అప్పటి నుంచి భారత్.. ఇది అంతర్గత విషయమని జోక్యం చేసుకోవద్దని చెబుతూనే ఉంది.      

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు

india
Turkey President
J&K
Pak
Pakistan
Turkey

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు