మండలిలో వ్యూహ ప్రతివ్యూహాలు : డొక్కా పయనం ఎటు

Submitted on 21 January 2020
Dokka Manikya Varaprasad Likely Join YCP

మూడు రాజధానుల బిల్లుపై కీలక సమయం వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరుతారా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆయనతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. 2020, 21వ తేదీ మంగళవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 రాజధానులు, CRDA రద్దు బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టింది.

అనూహ్యంగా డొక్కా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటిదాక ఉన్న పొలిటికల్ హీట్ మరికాస్త పెరిగింది. అంతకంటే ముందు..జనవరి 20వ తేదీ రాత్రి వైసీపీ నేతలు మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీలోకి రావాలని నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. కానీ ఈ విషయంలో డొక్కా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయ గురువు అయిన రాయపాటి సలహా మేరకు డొక్కా నడుచుకొనే ఛాన్స్ ఉంది.

గతంలో వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన డొక్కాను రాయపాటి అడ్డుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి టీడీపీ పార్టీకి రాజీనామా చేయలేదంటున్నారు. అధిష్టానం నిర్ణయం తర్వాత భవిష్యత్‌పై ప్రకటన చేస్తానని అంటున్నారు డొక్కా. తన ఓటుతో బిల్లు వీగిపోతుందంటే..తప్పకుండా ఓటు వేస్తానని అంటున్నారు. 

* 2020, జనవరి 20వ తేదీ సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన 3 మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ శానససభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 
* వికేంద్రీకరణ బిల్లు మంగళవారం శాసనమండలి ముందుకు వచ్చింది.
* కానీ వైసీపీకి శాసనమండలిలో 9 మంది మాత్రమే ఉన్నారు. 
* గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కంతేటి సత్యనారాయణరాజు వైసీపీలోనే ఉండటంతో ప్రభుత్వ బలం 10కి చేరింది. 

* టీడీపీకి 34మంది సభ్యులున్నారు. అందులో 28 టీడీపీ ఎమ్మెల్సీలు,  ఐదుగురు నామినేటెడ్‌ సభ్యులు, ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. 
* 58 మంది సభ్యులున్న మండలిలో టీడీపీదే అధిపత్యంగా ఉంది. 
* బీజేపీకి ఇద్దరు సభ్యులున్నారు. 

* ముగ్గురు ఇండిపెండెంట్లు, 8 మంది నామినేటెడ్ సభ్యులు, ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలున్నారు. 
* మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 
* ప్రభుత్వానికి కొంతమంది ఒకే అన్నా..వైసీపీకి 14మంది సభ్యుల బలం మాత్రమే దక్కుతోంది. 

* కానీ... బిల్లును గట్టెక్కించాలంటే అధికార పక్షానికి మరో ఆరుగురు ఎమ్మెల్సీలు అవసరం. 

Read More : మండలి ఛైర్మన్‌పై బోత్స ఆగ్రహం : రాజకీయాలు ఆపొదించొద్దు - షరీఫ్

Dokka Manikya Varaprasad
likely
join
YCP
Ap Counsil
Rajadhani

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు