శృంగారానికి ఎక్స్‌‌పైరీ డేట్ ఉంటుందా?

Submitted on 26 February 2020
Does ex Have an Expiration Date

మనమంతా జీవితాంతం సెక్సువల్ గానే ఉంటామన్నది సైన్స్ మాట. సెక్స్ కంటూ ఎలాంటి ఎక్స్‌‌పైరీ డేట్ లేదు. కాకపోతే ధాటి, ధోరణి మారుతుంది. 50 రాగానే ఇక చాల్లే అనుకొనేవాళ్లు ఎక్కువ. వాళ్లలో కోరికున్నా, ఏజ్ వచ్చేసిందనుకొని పట్టించుకోరు. ఇది బాధాకరం. ఈలోపే పిల్లలు పెద్దవాళ్లయిపోయి, మనవళ్లను తీసుకొచ్చి చేతిలో పెడతారు. పెంచమంటారు. కోడలితోడుగా ఉండమని అమ్మని బలవంతంపెడుతుంటారుతప్ప వాళ్ల గురించి ఆలోచించరన్నది సైకాలజిస్ట్‌ల మాట. ఇండియాలాంటి దేశాల్లో 50 దాటిన తర్వాత వాళ్ల జీవితం అయిపోయినట్లు, పెద్దరికాన్ని ఆపాదించేస్తారు.

50ఏళ్లుదాటిన మగాళ్లలో తమ సామర్ధ్యం గురించి అనుమానాలు మొదలవుతాయి. అంగస్థంభన సమస్య వచ్చినట్లు ఫీలవుతారు. ఫెయిల్ అయ్యారా అంతే! రొమాన్స్ లేనట్లేనని నమ్మేస్తారు. అసలు ఎందుకు ఈ కంప్లైయంట్?

ఇందులో మూడు విషయాలున్నాయి. ఒకటి వాళ్లలో కొరిక తగ్గిపోతుంది. రెండోది వాళ్లు కుర్రాళ్లగా పడకగదిలో చెలరేగిపోలేరు. ఆ సంగతిని వాళ్లు పట్టించుకోరు. నేను 30ల్లో ఉన్నప్పుడిలా ఉత్సాహంగాలేనని అనుకొని తెగ ఫీలయిపోతారు. ఇక మూడోది, పార్టనర్ నుంచి కోఆపరేషన్. వాళ్లకూ ఏజ్ వచ్చింది. ప్రతిరోజూ ఎందుకు? అప్పడప్పుడు చాలని ఫిక్స్ అయిపోతారు. ఇదే పెద్ద సమస్య.  భాగస్వామి చురుగ్గా ఉంటే పక్కనున్నవాళ్లలోని కోరిక ఫెరుగుతుంది. లేదంటే వాళ్లలో స్వతహాగా పుట్టాలి. దీన్నే spontaneous desire అంటారు. శరీరం తోడును కోరుకొంటున్నప్పుడు శృంగారవాంఛ పుడుతుంది. అసలు ఈ కోరికే మిస్ అయినప్పుడే సమస్య. అప్పుడు కావాల్సింది మానసిక కోరిక. పార్టనర్ ఎంకరేజ్ చేస్తే ఆ కోరిక కాస్తా కామోద్రేకంగా మారుతుంది. అప్పుడు మూడ్ కోసం వెయిట్  చేయనక్కర్లేదు. మొదలుపెట్టడటమే.

లేటెస్ట్ గా, ageless sexuality అన్న కాన్సెఫ్టె పెరుగుతోంది. అయినా రొమాన్స్ కు  ఏజ్ ఏంటి? సినిమాల్లో చూపించినట్లు ఇదేమీ కుర్రాళ్ల యవ్వారమేమీకాదు, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. కావాల్సిందల్లా కాస్తంత ఓపిక, శృంగారాన్ని అనుభవించాలన్న ఉత్సాహంచాలని అంటారు    “Naked at Our Age” పుస్తక రచయిత JOAN PRICE. ఏజెలెస్ సెక్స్ కి senior sex అని పేరుకూడా పెట్టారు. 50ఏళ్లు దాటిన తర్వాత రొమాన్స్ మధురంగా ఉంటుందన్నది ఆమె స్టడీ రిజల్ట్.

రొమాంటిక్ లవ్ అంటూ సినిమాల్లో చూపిస్తుంటారుకాని నిజానికి అలాంటిదేమీ లేదని తేల్చేస్తున్నారు సైకాలజిస్ట్ లు. రొమాన్స్ కు మనమెప్పుడూ సిద్ధమే. అలాగని అదేమీ రిలేషన్ షిప్ కాదు. రొమాన్స్ అన్నది, రిలేషన్ షిప్ లో తక్కువ సమయంపాటు వచ్చే పార్ట్. అందరూ సెక్స్ అనగానే సహజంగానే జరిగిపోతుందని అనుకొంటారు. ఒకవేళ అనుకున్నంత సామర్ధ్యాన్ని చూపించలేనప్పుడు మగాళ్లు క్రుంగిపోతారు.

 పడకగది సంతృప్తి చాలా రకాలు. అంతేకాని కుర్రవయస్సులో ఉన్నప్పటి ఉత్సాహాన్ని ఎందుకు 50 ఏళ్లు దాటిన తర్వాతా ఆశించాలి? ఇక్కడే ఎక్కువమంది ఫెయిల్ అవుతున్నారని సైకాజిస్ట్ లు తేల్చేస్తున్నారు. శృంగారానికి చాలా టెక్నిక్ లున్నాయి. అందుకే దీన్ని “Great Sex Without Penetration”అని పిలుస్తున్నారు.  ఇది ఎంజాయ్ చేయడం వస్తే ఎంత ఏజ్ వచ్చినా, జీవితాంతం శృంగారానికి అందరూ సిద్ధమే. 

Expiration Date

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు