ప్రభుత్వ డాక్టర్ ఘనకార్యం : ఎడమ చెయ్యి విరిగితే కుడి చెయ్యికి కట్టు

Submitted on 26 June 2019
Doctors plaster wrong arm of boy at Bihar hospital

ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్వాకం మరోసారి వెలుగులోకి వచ్చింది. విధుల్లో వారు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో బయటపడింది. వారి ట్రీట్ మెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసింది.
ఎడమ చెయ్యి విరిగితే.. కుడి చెయ్యికి కట్టు కట్టి ఇంటికి పంపించారు. బీహార్ రాష్ట్రంలోని దర్బాంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘోరం జరిగింది. సర్కారీ డాక్టర్ల ట్రీట్ మెంట్ మరీ ఇంత గొప్పగా ఉంటుందా అని అంతా షాక్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. దర్బాంగాలోని హనుమాన్ నగర్ లో నివాసం ఉండే ఫైజాన్ అనే బాలుడికి చెయ్యి విరిగింది. నొప్పితో విలవిలలాడుతున్న ఫైజాన్ ని అతడి తల్లిదండ్రులు దర్బాంగా మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఓ డాక్టర్ బాబుని పరీక్షించాడు. అతడి కుడి చేతికి కట్టుకట్టాడు. తగ్గిపోతుంది.. ఇక ఇంటికి వెళ్లు అని పంపించాడు. అయితే..ఆ డాక్టర్ తీరుతో పిల్లాడు సహా తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కారణం.. ఒక చెయ్యి విరిగితే మరో చెయ్యికి ట్రీట్ మెంట్ చెయ్యడమే.. డాక్టర్ గారు.. విరిగింది నా ఎడమ చెయ్యి.. కుడి చెయ్యి కాదు.. అని ఆ పిల్లాడు నెత్తీనోరు బాదుకున్నా ఆ డాక్టర్ వినిపించుకోలేదు. హడావుడిగా కుడి చేతికి కట్టుకట్టి పంపించేశాడు. అంతేకాదు.. ప్రిస్కిప్షన్ లోనూ అదే రాశాడు. ఎడమ చెయ్యి విరిగినట్టు ఎక్స్ రేలో కూడా క్లియర్ గా ఉంది. అయినా ఆ డాక్టర్ కుడి చెయ్యికి కట్టుకట్టేశాడు.

డాక్టర్ తీరుతో పిల్లాడు, అతడి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. దీనిపై వారు ఆసుపత్రి సూపరింటెండెంట్ కి ఫిర్యాదు చేశారు. డాక్టర్ నిర్వాకం తెలుసుకుని సూపరింటెండెంట్ కూడా కంగుతిన్నాడు. తప్పు జరిగింది క్షమించమన్నాడు. దీనికి తాను పూర్తి బాధ్యత వహిస్తాను అని చెప్పాడు. వెంటనే బాబుకి మరో డాక్టర్ దగ్గర ట్రీట్ మెంట్ ఇప్పించి పంపించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

Doctors
plaster
wrong arm
Boy
BIHAR
hospital
ignore


మరిన్ని వార్తలు