తమిళనాడులో స్టాలిన్ ను ప్రశాంత్ కిషోర్ గెలిపించబోతున్నారా..?

Submitted on 3 December 2019
DMK ropes in strategist Prashant Kishor

ప్రశాంత్ కిషోర్ ఈసారి తమిళనాడులో స్టాలిన్ ను అందలమెక్కించడానికి సిద్ధమవుతున్నారు. 2021లో జరిగే ఎన్నికల్లో డిఎంకె విజయం కోసం పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 2014లో మోదీ, 2019లో వై.ఎస్.జగన్ లకు భారీ విజయాల కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె కోసం పని చేయడానికి ఇండియన్ పొలిటిక్ యాక్షన్ కమిటీ(IPAC)ఒప్పందం కుదుర్చుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అధికార ప్రకటన రావాల్సి ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ పోల్స్ లో డి.ఎం.కె. వ్యూహాలు పని చేయలేదు. అందుకే రాజకీయ సలహాదారుడు సునీల్ కె. బయటకొచ్చేశారు. సునీల్, ప్రశాంత్ కిషోర్ లకు మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్ననెస్ సంస్థను ప్రారంభించారు. ఇదే ఆ తర్వాత ఐపాక్ గా మారింది. 

రాజకీయ వ్యూహకర్తల పార్టీలకు పని చేస్తూనే బీజేపీ మిత్రపక్షం జనతాదళ్(యునైటెడ్)కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గత యూపీ ఎన్నికల్లో ఆయన వ్యూహాలు పారకపోయినా దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ కోసం ఎదురుచూసే పార్టీలు ఎక్కువే. 2014లో మోడీ మేనియాను సష్టించడంలో కిషోర్ ది ముఖ్యపాత్ర. అందుకే మోడీని ఎదుర్కోవాలనుకొంటున్న పార్టీలు ఆయన సేవలను కోరుకుంటున్నారు. కిషోర్ మాత్రం ఆచితూచి పార్టీలను ఎంచుకుంటున్నారు.

తిరుగులేని ట్రాక్ రికార్డ్:

ఐపాక్ కు కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను గెలిపించిన క్రెడిట్ కిషోర్ ది. 2017లో పంజాబ్ లో కాంగ్రెస్ ను, అంతకుముందు బీహార్ లో నితీష్ కుమార్ ను గెలిపించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ తర్వాతే ఆయన నితీష్ పార్టీలో చేరారు. అంతెందుకు తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన స్ట్రాటజీ పనిచేసింది. ఆదిత్య థాకరే జన ఆశీర్వాద్ యాత్ర చేపట్టాల్సిందిగా సలహా ఇచ్చింది ఐపాకే. 

కాకపోతే రాహుల్ గాంధీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ను కిషోర్ ఉసూరుమనిపించారు. సమాజ్ వాదీ పార్టీతో కలసి పోటీ చేస్తే విజయం తథ్యమని కాంగ్రెస్ కు నచ్చచెప్పినా... అదికాస్తా ఎదురుతన్నింది. పశ్చిమ బెంగాల్ లో దూసుకొస్తున్న కాషాయ దళాన్ని ఎదుర్కోవడానికి మమతాబెనర్జీ ప్రశాంత్ కిషోర్ సాయం అడిగారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయాన్ని సాధించేందుకు మమతా ఐపాక్ వ్యూహాలను అమలు చేయబోతున్నారు. ఇటీవల ఉప ఎన్నికల్లో మమతా క్లీన్ స్వీప్ చేయడం వెనుక ఐపాక్ వ్యూహం ఉందని, అందుకే ఎన్.ఆర్.సీ అంశాన్ని మమతా ప్రచారాస్త్రంగా మార్చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

dmk
strategist
Prashant Kishor
tamilnadu
cm jagan
Modi
Elections
polls
AP
UP
Mamata Banerjee
ipac

మరిన్ని వార్తలు