ఆసియా రెజ్లింగ్‌లో దివ్య కక్రాన్, మంజూ కుమారిలకు కాంస్యం

Submitted on 25 April 2019
Divya Kakran, Manju Kumari win bronze medals

ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్‌లో మనోళ్లు సత్తా చాటారు. 68 కేజీల విభాగంలో మంగోలియా రెజ్లర్ బట్టసెసెగ్ సొరొంజన్బోను చిత్తుగా ఓడించిన దివ్య కక్రాన్ కాంస్యం సొంతం చేసుకుంది. ప్లే ఆఫ్‌లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి పోడియం వేదికగా విజయాన్ని వరించింది. 

అది కాకుండా 59 కేజీల విభాగంలో మంజూ కుమారి వియత్నాం రెజ్లర్ తి హువాంగ్ దావోను 11-2తేడాతో ఓడించి భారత్‌కు రెండో కాంస్యాన్ని అందించింది. వారితో పాటుగా ప్లే ఆఫ్ వరకూ చేరుకోగలిగిన సీమా.. కజకిస్తాన్‌కు ఛెందిన వాలెంటీనా ఇవనోవ్నాను 5-11తేడాతో 50కేజీలో విభాగంలో ఓడించేందుకు ప్రయత్నించి విఫలమైంది. 

భారత్‌కు గురవారం నాటికి వచ్చిన పతకాలతో ఖాతాలో 10పతకాలు (1 స్వర్ణం, 3 రజతాలు, 6కాంస్యాలు) చేరాయి. శుక్రవారం మరో 2 పతకాలు తెచ్చేందుకు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ సిద్ధమవుతున్నారు. 

Divya Kakran
Manju Kumari
wrestling
asian wrestling championship

మరిన్ని వార్తలు