డిస్కో రాజా ఫ్రీకౌట్ -సెన్సార్ టాక్

Submitted on 21 January 2020
Disco Raja Freak Out Lyrical Video Song

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ కథానాయికలుగా నటించారు. తమిళ నటుడు బాబీ సింహా విలన్ పాత్రలో కనిపించనున్నాడు.

Image

ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మరో కొత్త ఫ్రీకౌట్ వీడియో విడుదల చేశారు. వి.ఐ.ఆనంద్ మార్క్ టేకింగ్, రవితేజ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, థమన్ ఆర్ఆర్, కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ అదిరిపోయాయి. సోమవారం ‘డిస్కో రాజా’ సెన్సార్ పనులు పూర్తయ్యాయి.


Read Also : RRR షూటింగులో జాయిన అయిన అజయ్ దేవ్‌గన్

Image

సినిమా చూసిన సెన్సార్ టీమ్ U/A సర్టిఫికెట్ జారీ చేశారు. దర్శకుడు సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ఓ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేశారని, రవితేజ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుందని.. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఓ కొత్త ఫీలింగ్ కలిగిస్తుందని సెన్సార్ సభ్యులు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రవితేజ పుట్టినరోజు మరియు రిపబ్లిక్ డే కానుకగా ఈ నెల 24న ‘డిస్కో రాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Ravi Teja
Nabha Natesh
Payal Rajput
Bobby Simha
SS Thaman
SRT Entertainments
VI Anand

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు