రికార్డుల వేట : కొత్త చరిత్రకు దగ్గరలో ధోనీ

Submitted on 12 February 2019
DHONI ready to break another world record


వికెట్ కీపర్‌గా ఆడిన తొలి మ్యాచ్ నుంచి న్యూజిలాండ్‌తో ముగిసిన ఆఖరి టీ20వరకూ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వేగంలో ఏ మార్పూ లేదు. మెరుపు వేగంతో స్టంపౌట్ చేయడంలో ధోనీని మించిన వారు లేరు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కూడా ఇటీవల స్పష్టం చేసింది. వికెట్ కీపర్‌గా ధోనీ ఉన్నప్పుడు బ్యాట్స్‌మెన్ మరింత జాగ్రత్తగా ఉండాలని, క్రీజును వదలొద్దంటూ ట్వీట్ చేసింది. 

ఇదే క్రమంలో ధోనీ వికెట్ కీపింగ్ మరో ప్రపంచ రికార్డు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా భారత్‌ జట్టులో కీపర్‌గా కొనసాగుతున్న ధోనీ.. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో మొత్తంగా 594 మ్యాచ్‌లకి పైగా  ప్రాతినిథ్యం వహించాడు. ఈ మేర మరో 3 మ్యాచ్‌ల్లో ఆడితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వికెట్‌ కీపర్‌గా రికార్డుల్లో నిలవనున్నాడు. 

ఈ రికార్డుల్లో దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ 596 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత మహేంద్రసింగ్ ధోనీ (594) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజ వికెట్ కీపర్ కుమార సంగక్కర 499 మ్యాచ్‌లతో ఉండగా.. 485 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఫిబ్రవరి 24 నుంచి భారత్.. ఆస్ట్రేలియాతో 2 టీ20లు, 5 వన్డేల సిరీస్‌ను ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ధోనీ ఈ నెం.1 రికార్డుని అందుకోవడానికి మరో మూడు మ్యాచ్‌ల దూరమే ఉంది. 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: ఈఎంఐ కట్టనేలేదు: ఆపిల్ అనుకొని ‘ఐఫోన్’ విసిరాడు


మరిన్ని వార్తలు