దేవినేని ఉమ ఫైర్ : సీబీఐ చిటికేస్తే..జగన్ ఏమవుతారు

Submitted on 17 November 2019
Devineni Uma is angry On Minister Kodali Nani

జగన్ చిటికేస్తే టీడీపీ ఉండదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారని..అదే..సీబీఐ చిటికేస్తే సీఎం జగన్ ఏమవుతారు ? వైసీపీ ఏమవుతుందని ప్రశ్నించారు టీడీపీ నేత దేవినేని ఉమ. మంత్రి కొడాలి నాని, జగన్ లపై ఉమ ఫైర్ అయ్యారు. కొన్ని రోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన తీవ్ర విమర్శలపై దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

సన్నబియ్యం గురించి అడిగితే..నానికి ఎందుకంత అసహనం అని ప్రశ్నించారు. సన్నబియ్యం ఇస్తానని ఎన్నోసార్లు చెప్పారని, అంతేగాకుండా..పాదయాత్రలో జగన్ కూడా ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారా ? ఒక బాధ్యత గల మంత్రి మాట్లాడే బాషేనా అంటూ ప్రశ్నించారు. జగన్ స్క్రిప్ట్ ప్రకారమే మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇసుక దొరకడం లేదని దీక్ష చేస్తే..అపహాస్యం చేస్తారా అంటూ నిలదీశారు. 

ఏపీలో రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. టీడీపీపై వల్లభనేని వంశీ, కొడాలి నాని కామెంట్స్‌తో ఈ పొలిటికల్‌ హీట్‌ ఓ రేంజ్‌కు పెరిగింది. కొన్ని రోజులుగా ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పుడది పీక్స్‌కు చేరింది. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ చేస్తున్న వ్యాఖ్యలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ చిటికేస్తే.. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుతుందన్నారు నాని. టీడీపీ పార్టీ ఆఫీసుని వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ స్టోర్ రూంలో పెట్టిస్తామని విమర్శించారు. మొత్తానికి వైసీపీ, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. 
Read More : డాక్టర్ల నిర్వాకం : బాలింత కడుపులో దూది పెట్టి కుట్టేశారు

Devineni Uma
Angry
Minister Kodali Nani

మరిన్ని వార్తలు