జర్నలిస్టు హత్యకేసులో డేరాబాబా దోషి 

Submitted on 11 January 2019
dera baba

ఢిల్లీ: జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్యకేసులో డేరా బాబాతో పాటు మరో ముగ్గురిని దోషులుగా ప్రకటిస్తూ పంచకుల ప్రత్యేక న్యాయస్ధానం శుక్రవారం తీర్పు చెప్పింది. జనవరి 17న  నలుగురికి శిక్షలు ఖారారు చేయనున్నారు. ఇప్పటికే డేరా సచ్ఛా సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ హర్యానాలోని రోహ్‌తక్‌ సునారియా జైల్లో, అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు జర్నలిస్టు హత్యకేసులో డేరాబాబాకు మరో సారి జైలు శిక్ష పడనుంది. సిర్సాలోని డేరా సచ్చా సౌద హెడ్ క్వార్టర్స్‌లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గతంలో జర్నలిస్టు రామచంద్ర కధనాలు ప్రచురించారు. వాటిపై కక్ష పెంచుకున్న బాబా అనుచరులు 2002 లో రామచంద్రను హత్య చేశారు. 
గతంలో డేరా బాబా ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో తీర్పు వెలువరించినప్పుడు జరిగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల్లో 36 మంది మరణించారు. శుక్రవారం డేరాబాబా, జర్నలిస్టు హత్య కేసులో తీర్పు వెలువరించే సమయంలో ముందు జాగ్రత్త చర్యగా  కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేసి, ప్రత్యేక బలగాలను మొహరించారు. 

Dera Baba
journalist
murder case
Panchkula court

మరిన్ని వార్తలు