అలా చేస్తే బాలయ్య కూడా వైసీపీలోకి వచ్చేస్తారు: ఉప ముఖ్యమంత్రి

Submitted on 12 January 2020
Deputy CM K Narayana Swamy Comments on Chandrababu

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నందమూరి బాలకృష్ణతో పార్టీ మారిపోతారిని అన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, నారా లోకేష్‌లు మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అన్నారు ఆయన.  

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారయణ స్వామి.. నందమూరి బాలకృష్ణ మీదున్న కేసును రీఓపెన్‌ చేయిస్తామంటే ఆయన కూడా వైసీపీలోకి వచ్చేస్తారని అన్నారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసునుంచీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహాయంతోనే బయటపడ్డారని నారాయణ స్వామి గుర్తుచేశారు. 

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు రాయలసీమకు చేసింది శూన్యం అని అభిప్రాయపడ్డారు నారాయణ స్వామి. ఇప్పుడు కూడా అమరావతి పేరిట స్వలాభం కోసమే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.

Deputy CM K Narayana Swamy
Chandrababu
Balakrishna

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు