రోహిత్ తివారీని హత్య చేసింది భార్యే! : పోలీసుల కస్టడీలో అపూర్వ

Submitted on 22 April 2019
Delhi Police takes Rohit Shekhar's wife into custody for interrogation

ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులో ఆయన భార్య అపూర్వ ప్రధాన నిందితురాలని పోలీసులు అనుమానిస్తున్నారు.ఆదివారం(ఏప్రిల్-21,2019)ఢిల్లీ పోలీసులు అపూర్వను ఇంటరాగేషన్ కోసం కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం(ఏప్రిల్-16,2019) రోహిత్ గుండెపోటుతో ఓ ఆస్పత్రిలో చనిపోయినట్లు మొదట వార్తలు వచ్చాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసును బుక్ చేశారు.అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ తో రోహిత్ ది హత్య అని తేలడంతో ఈ కేసుని దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేశారు.
Also Read : బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు

శనివారం(ఏప్రిల్-20,2019)సౌత్ ఢిల్లీలోని రోహిత్ నివాసంలో ఎనిమిది గంటలపాటు క్రైమ్ బ్రాంచ్ అధికారులు అపూర్వను ప్రశ్నించారు. అపూర్వ,ఆమె తల్లిదండ్రులు తమ ప్రాపర్టీపై కన్నేశారని,తన కొడుకుని వారే హత్య చేసి ఉండవచ్చని ఆదివారం రోహిత్ తల్లి ఉజ్వల ఆరోపించారు.

మాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా 2017లో అపూర్వ,రోహిత్ లు లక్నోలో కలుసుకున్నారని,వాళ్లు సుప్రీంకోర్టు ఆవరణలో తొలిసారిగా కలుసుకున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె తెలిపారు.ఏడాదిపాటు ఇద్దరూ తరచూ కలుసుకుని మాట్లాడుకునేవాళ్లని, ఆ తర్వాత కొన్నాళ్లపాటు వాళ్ల మధ్య గ్యాప్ వచ్చిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారని ఆమె తెలిపారు.
Also Read : టీవీ నటి కూడా : మద్యం తాగి స్టేడియంలో యువతుల వీరంగం

custody
INTEROGATION
Delhi police
takes
RGHIT SHEKAR TIWARI
MYRDER
wife
APPORVA
PRIME SUSPECT

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు