కేజ్రీ కొత్త ఎత్తు : ఢిల్లీలో "గ్యారెంటీ కార్డ్" విడుదల

Submitted on 19 January 2020
Delhi elections 2020: Arvind Kejriwal releases 'guarantee card'

ఢిల్లీలో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని,మహిళల కోసం బస్సుల్లో మొహల్లా మార్షల్స్ ను నియమిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఆదివారం(జనవరి-19,2020) 'కేజ్రీవాల్ కా గ్యారెంటీ కార్డ్'ను ఢిల్లీ సీఎం విడుదల చేశారు. రాజధాని నగరంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, స్వచ్ఛమైన నీరు అందిస్తాం,రాబోయే ఐదేళ్లల్లో దేశ రాజధానిలో 2కోట్ల మొక్కలు నాటుతాం,మహిళా భద్రత, యుమునా నది ప్రక్షాళన, రవాణారంగాన్ని మెరుగుపరచడం, ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తాం అంటూ 10 ముఖ్యమైన హామీలను ఈ గ్యారెంటీ కార్డులో పొందుపరిచారు.

అయితే ఇది మేనిఫెస్టో కాదని కేజ్రీవాల్ తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామనే దృఢ సంకల్పాన్ని ఈ గ్యారంటీ కార్డ్ ద్వారా మరోసారి పార్టీ పునరుద్ఘాటించినట్టు తెలిపారు. రాబోయే 7-10రోజుల్లో ఆప్ సమగ్ర మేనిఫెస్టోని విడుదల చేయనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. మేనిఫెస్టోలో ముఖ్యంగా విద్యార్థులు,టీచర్లుకు సంబంధించిన అంశాలు ఉంటాయన్నారు. ఇది ప్రతి ఒక్కరికి అని ఆయన తెలిపారు.

కాగా, గత ఐదేళ్లలో పాఠాశాలల పీజులను అదుపులో ఉంచేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఆ విధానం మునుముందు కూడా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ ఆదివారం ఉదయం ఓ ట్వీట్‌లో భరోసా ఇచ్చారు.. ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడాన్ని అనుమతించేది లేదని, నిజాయితీ కలిగిన ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకూ ఢిల్లీలోని తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 67సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా 2015 రిపీట్ చేసేందుకు కేజ్రీవాల్ కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆప్ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు బీజేపీ కూడా ఢిల్లీ ఎన్నికలపై ఫుల్ సీరియస్ గా వర్క్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ అయితే ఈ రేస్ లో వెనుకబడినట్లే చెప్పవచ్చు. ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కు నాయకత్వ లేమి గట్టిగా కన్పిస్తోంది.

ARVIND KEJRIWAL GUARANTEE CARD
Delhi
release
Promises
FREE RIDES
Students
WOMAN SAFTEY
Elections

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు