ఢిల్లీని ఊడ్చేసిన ఈ సామాన్యుడు తినే కేజ్రీ ఫుడ్ ఏంటో?

Submitted on 14 February 2020
This is Delhi CM Arvind Kejriwal’s favourite food

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత  అరవింద్ కేజ్రీవాల్‌ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కేజ్రీవాల్ ఇంట్లో మీడియా సమావేశంలో జరిగిన ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ తనకు ఇష్టమైన ఫుడ్ గురించి చెప్పారు. 

ఆయన మాట్లాడుతూ.. మా పుట్టినరోజు, పెళ్లిరోజులకు నేను నా భార్య టేస్ట్ ఆఫ్ చైనాకు భోజనానికి వెళ్తాము. అది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అని తెలిపారు. అంతేకాదు ఒక రోజు సెక్యూరిటీకి తెలియకుండా నేను నా భార్య కలిసి గోల్గప్ప తినడానికి కమలా మార్కెట్కు వెళ్లాం. అక్కడి నుంచి నాకు చాలా ఇష్టమైన ఆలూ పరోటా, జీలేబి తిన్నాం అని తెలిపారు.

ఇంకా నేను రోటీ, ఆలూ కి సబ్జీ, ఆలూ పరోటా బాగా చేస్తానని అది నాకు చాలా ఇష్టమైన ఫుడ్ అని తెలిపారు. 

ఆలూ పరోటా:
కావాల్సినవి: 
గోధుమ పిండి, మైదా పిండి, బంగాళదుంపలు-3, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 4, అల్లం, వెల్లుల్లి 2 స్పూన్స్, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పసుపు తగినంత.

తయారీ విధానం:
కుక్కర్‌లో బంగాళదుంపలను ఉడికించుకోవాలి. ఒక పాత్రలో గోధుమపిండి, మైదాపిండిని కలుపుకుని ఉంచ్చుకోవాలి. ఆలూ కూడా పిండిలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా చిన్నగా వత్తుకోవాలి. వాటి మధ్యలో ఆలూ ముద్దను ఉంచి కూర బయటకు రాకుండా మడిచి పెనంపై కాల్చుకుంటే ఆలూ పరోటా రెడీ అవుతోందని తెలిపారు. 

Click Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్

Delhi CM
Arvind Kejriwal’s
favourite food

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు