హీరోని కలవాలని పెళ్లి కూతురు జంప్

Submitted on 19 June 2019
Delhi bride leaves wedding to meet Vikrant Massey

ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఎలా ఉండాలి. నచ్చిన హీరో సినిమా చూడటమో.. అతను చేసినట్లు అనుకరించడమో చేయాలి. కానీ, జీవితంలో ఒకేఒక్కసారి జరిగే పెళ్లిని కూడా హీరో కోసం త్యాగం చేసేసింది ఆ పెళ్లికూతురు. చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ హిందీలో ప్రసారమైనప్పటి  నుంచి విక్రాంత్ మస్సేకు లేడీ ఫ్యాన్స్ పెరిగిపోయారు. 

ఢిల్లీలోని సాకేత్ లో షూటింగ్ లో ఉండగా పెళ్లికూతురి గెటప్ లో ఓ యువతి విక్రాంత్ దగ్గరకు వచ్చింది. వచ్చీ రావడంతోనే ఏడవడం మొదలుపెట్టింది. నీ అభిమానిని ఇక్కడే ఉంటా. నాకు పెళ్లి వద్దని చెప్పింది. దానికి షాక్ తిన్న విక్రాంత్ ఆమెను కూర్చోపెట్టి కాసేపు ముచ్చటించాడు. అయినప్పటికీ వెళ్లేందుకు నిరాకరించడంతో సెక్యూరిటీ సిబ్బందితో ఆమెను పెళ్లి వేదిక దగ్గరకు పంపించేశారు. 

రణవీర్ సింగ్, సోనాక్షి సిన్హాలు నటించిన లుటేరా చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా బుల్లి తెరపై ఇంకా ప్రజలకు చేరువగానే ఉంటున్నాడు. మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్ వంటి వెబ్ సిరీస్ లలో నటిస్తు్న్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vikrant Massey (@vikrantmassey87) on

Delhi bride
Vikrant Massey

మరిన్ని వార్తలు