అంతా ఆన్ లైన్ : డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

Submitted on 23 May 2019
Degree Entrance Notification Released

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆన్‌లైన్‌ లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ) నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర  ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సంస్థ చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి బుధవారం (మే 22, 2019) నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు. ఉస్మానియా,  కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని 1,049 డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఎస్‌ డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో ప్రవేశాలు  చేపట్టనున్నారు. గురువారం (మే 23,2019) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. మీ సేవ, ఈ సేవ, ఆధార్‌ ఫోన్‌ లింకైన మొబైల్, హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. 

విద్యార్థుల సందేహాల నివృత్తి, సాంకేతిక సహకారం కోసం దోస్త్‌ కమిటీ 75 హెల్ప్‌ లైన్‌ కేంద్రాలను ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో.. మరో 7 కేంద్రాలను వర్సిటీల్లో ఏర్పాటు చేసింది. వీటితోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 10 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ సెంటర్లను అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. బయోమెట్రిక్‌ (వేలిముద్రలు) అథెంటికేషన్‌ సమస్య ఉంటే ఇక్కడ ఐరీస్‌ పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంది.  

* ఈసారి సీటు కన్ఫర్మేషన్‌ కోసం కాలేజీకి వెళ్లకుండా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
* నేరుగా కాస్లులు ప్రారంభమయ్యే నాడే కాలేజీలో రిపోర్ట్ చేయొచ్చు
* ఫీజు ఆన్‌లైన్ లో చెల్లించాలి
* ఎంపిక చేసుకున్న కాలేజీకి వివరాలను సమర్పించాలి
* దరఖాస్తు అప్పుడే విద్యార్థి ద్వితీయ భాష వివరాలుంటాయి.

Degree
Entrance
notification
Telangana
Online

మరిన్ని వార్తలు