యాసిడ్ అమ్మకాలపై దీపికా స్టింగ్ ఆపరేషన్...అందరూ షాక్ అవ్వాల్సిందే

Submitted on 15 January 2020
Deepika Padukone conducts sting operation to find out how easy it’s to buy acid, collects 24 bottles in a day

యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితకథ ఆధారంగా తెరకెక్కన చపాక్ మూవీ ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను కట్టిపడేశారు. అయితే అసలు యాసిడ్ దాడులు మనదేశంలో జరగడానికి ప్రధాన కారణం...చాలా ఈజీగా చాక్లెట్లు అమ్మినట్లు షాపుల్లో యాసిడ్ బాటిల్స్ ను అమ్మడమే. యాసిడ్...అనేక జీవితాలను నాశనం చేసింది. చాలా మంది కలలను కలలుగానే మార్చేసింది. చాలా మంది ఆశలను దెబ్బతీసింది.  అనేక మంది భవిష్యత్తుపై మచ్చలు చేసింది. అసలు యాడిడ్ బాటిల్స్ కొనేవ్యక్తి,అమ్మేవ్యక్తి కొన్ని రూల్స్ పాటించాలని సుప్రీంకోర్టు తీర్పు,నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్చగా యాసిడ్ అమ్మకాలు ఎలా జరుగుతున్నాయో అందరికీ తెలియజేసేలా నటి దీపికా పదుకుణె ఓ సోషల్ ఎక్స్ పరిమెంట్ చేశారు.

చపాక్ బృందంతో ఒక ‘సామాజిక ప్రయోగం’ లో భాగంగా దీపికా....కొనుగోలుదారుడి నుండి ఎలాంటి ఐడి ప్రూఫ్ అవసరం లేకుండా కొంతమంది దుకాణదారులు యాసిడ్‌ను ఎంత సులభంగా విక్రయిస్తారో తనిఖీ చేయడానికి ఒక రకమైన స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా దీపికా కారులో కూర్చొని తన బృందాన్ని వేర్వేరు షాపులకు పంపిస్తుంది. ముందుగా వారికి సెట్ చేసిన కెమెరాల ద్వారా దీపికా వారిని తన దగ్గరున్న ఎలక్ట్రానికక్ పరికరం ద్వారా వారిని గమనించింది. ఇలా దీపికా బృందం ఆయా షాపులకు వెళ్లి యాసిడ్ బాటిల్స్ కావాలని అడుగగా చాలామంది దుకాణదారులు ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అడగకుండా,ఎందుకు, ఏమిటి,ఏం చేస్తారు దీనితో అని అడగకుండా వాళ్లకి యాసిడ్ బాటిల్స్ అమ్మారు. కొందరు దుకాణదారులయితే ఎందుకు ఈ యాసిడ్,ఎవరిమీదైనా వేస్తున్నారా అని ప్రశ్నించి కూడా అమ్మకుండా ఊరుకోలేదు. దీనికి సంబంధించిన వీడియోను దీపికా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఎవరైనా మీకు ప్రపోజ్ చేస్తే మరియు మీరు నో చెప్పే, ఎవరైనా మిమ్మల్ని వేధించినప్పుడు మీ గొంతు పెంచండి, లేదా మీరు మీ హక్కుల కోసం పోరాడుతుంటే ...ఎవరైనా మీ ముఖం మీద యాసిడ్ విసురుతారు అంటూ  వీడియో ప్రారంభంలో దీపిక చెప్పారు. ప్రజలపై యాసిడ్ విసిరేందుకు అతి పెద్ద కారణం యాసిడ్ మాత్రమేనని,విక్రయించకపోతే అది విసిరివేయబడదు అని దీపికా ఆ వీడియోలో తెలిపారు.  దుకాణదారులను మాత్రమే కాదు, ఎవరైనా చట్టవిరుద్ధంగా యాసిడ్ కొనడం లేదా అమ్మడం చూస్తే, మనం వెంటనే పోలీసులకు తెలియజేయటం అనేది మన బాధ్యత కూడా వీడియోలో దీపిక చెప్పారు.  వీడియో ముగింపులో దీపికా... తన బృందం కేవలం ఒక రోజులో 24 బాటిల్స్ యాసిడ్ కొనుగోలు చేయగలిగిందని తెలిపింది. యాసిడ్ అమ్మకాలపై సుప్రీంకోర్టు కఠినమైన నిబంధనలు విధించిన తరువాత కూడా ఇది జరిగిందని దీపికా తెలిపింది.

 నిజజీవితంలో యాసిడ్ దాడికి గురైన బాధితులు దీపికా  తర్వాత యాసిడ్ అమ్మకాల రూల్స్ గురించి ఆ వీడియోలో తెలిపారు.యాసిడ్ కొనుగోలుదారు 18 ఏళ్ళకు పైబడి ఉండాలి. ఐడి ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్‌ను దుకాణదారుడికి సమర్పించాలి. మరియు విక్రేతకు యాసిడ్ విక్రయించడానికి దుకాణదారుడికి లైసెన్స్ ఉండాలి,యాసిడ్ అమ్మకం తర్వాత ఆ విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో దుకాణదారుడు   తెలియజేయాలని అని వీడియో చివర్లో నిజజీవితంలో యాసిడ్ దాడికి గురైనవాళ్లు చెప్పడం మనం చూడవచ్చు.

Deepika Padukone
Sting operation
ACID SALES
shops
india
Problem
PROOF
no
Video

మరిన్ని వార్తలు