డియర్ కామ్రేడ్ : ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ !

Submitted on 22 March 2019
Dear Comrade vijay devarakonda Admitted hospital

టాలీవుడ్‌లో యంగ్ హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. తనదైన స్టైల్..హవభావాలతో అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ నటుడు ఆసుపత్రి పాలయ్యాడనే వార్త చక్కర్లు కొడుతోంది. స్వల్ప అస్వస్థతకు గురి కావడంతోనే ఆయన చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారని తెలుస్తోంది.  విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొంటుండడంతో ‘విజయ్’ కొంత వత్తిడికి గురైనట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో ‘డియర్‌ కామ్రేడ్‌' సినిమా నిర్మితమౌతోంది. ఏకధాటిగా సినిమా షూటింగ్ కొనసాగుతోంది. భరత్ కమ్మ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ‘విజయ్’ సరసన ‘రష్మిక’ హీరోయిన్‌గా నటిస్తోంది. 
Read Also : యడ్డీ డైరీ లీక్స్ ప్రకంపనలు : బీజేపీ నేతలకు భారీగా ముడుపులు

‘డియర్ కామ్రేడ్’ సినిమాకు సంబంధించి టీజర్ ఇటీవలే విడుదలై అభిమానులను అలరించింది. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తాడని టాక్. మే 31న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే..మార్చి 21వ తేదీ గురువారం ఒత్తిడి ఎక్కువై విజయ్ అనారోగ్యం పాలయ్యారని సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అయ్యింది.

ఇందులో భయపడాల్సిందేమీ లేదని విజయ్ ఓ పత్రికతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. హోలీని చాలా గొప్పగా జరుపుకున్నట్లు..షూటింగ్ సమయంలో జర్వం వచ్చిందని అర్థమైందని..తొందరగా నయం కావాలనే ఉద్దేశ్యంతో ఆసుపత్రికి వెళ్లినట్లు విజయ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. 
Read Also : చెన్నైలో కలకలం : శ్రీరెడ్డిపై తమిళ నిర్మాత దాడి

Dear comrade
Vijay Devarakonda
Admitted
hospital
Rowdey
Vijay Student Leader
Rashmika

మరిన్ని వార్తలు