యమపురికీ సెలవులు : పెళ్లాం ఏడుపుతో చచ్చినాయన లేచాడు

Submitted on 12 January 2019
Dead man woke up after death in Nirmal

యమపురిలో సంక్రాంతి సెలవులేమో.. చనిపోయిన మనిషి లేచి కూర్చొన్నాడు. మీరు విన్నది నిజమే. ఉలుకు పలుకు లేకుండా మంచంలో పడి ఉన్న వ్యక్తిని చూసి కుటుంబ సభ్యులు చనిపోయాడాని అనుకున్నారు. మరణవార్తను బంధువులకు చేరవేశారు. కుటుంబ సభ్యులంతా చనిపోయిన వ్యక్తి దగ్గర కూర్చొని కన్నీరుమున్నీరువుతున్నారు. అప్పటివరకూ బాగానే ఉన్న మనిషి సడన్ గా చనిపోయేసరికి అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంతలో చచ్చిన మనిషి లేచి కూర్చొన్నాడు. ఏమైందో ఏమో తెలియదు.. చనిపోయిన మనిషి లేచే సరికి ఏడుస్తున్నవారంతా షాక్ అయ్యారు.

దు:ఖంలోనే సంతోషం రెండూ కలగలసి ఆశ్చర్యంగా అతడివైపే చూస్తున్నారు. లేచిన వ్యక్తి.. ఏమైంది.. అంతా ఏడుస్తున్నారు.. నేను చావలేదు. బతికే ఉన్నాను.. అంటూ చెప్పాడు. ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ ఘటన నిర్మల్‌ జిల్లా నరసాపూర్‌ మండలంలో చోటుచేసుకుంది. నరసాపూర్‌ మండలంలోని దర్యాపూర్‌ గ్రామానికి చెందిన 49 ఏళ్ల లింగన్న అనే వ్యక్తి గతకొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం అతడు కళ్లు, నోరు తేలేయడంతో లింగన్న మృతిచెందాడని కుటుంబ సభ్యులంతా భావించారు.

బంధువులకు కబురు పెట్టారు. అంతా ఇంటికి చేరుకున్నారు. లింగన్న అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. లింగన్న భార్యతో పాటు బంధువులంతా ఏడుస్తూనే ఉన్నారు. ఇంతలో లింగన్న లేచి కూర్చొన్నాడు. అందరూ షాకయ్యారు. చచ్చిన లింగన్న బతికే సరికి అంతా సంతోష పడ్డారు. యమపురిలో సంకాంత్రి సందర్భంగా సెలవులు ఇచ్చినట్టుగా మంచంలో నుంచి లేచి కూర్చొన్న లింగన్న.. అదే రోజు అందరితో సాయంత్రం వరకు ముచ్చటించాడు. అంతలోనే సెలవు క్యాన్సిల్ అయినట్టు తిరిగి యమపురికి వెళ్లిపోయాడు. 

nirmal
Linganna
Yamapuri
Sankranthi festival
Sankranthi Holidays

మరిన్ని వార్తలు