Jobsపై స్పీచ్ : చేసేది కూలిపని.. ఇంగ్లీష్ ఇరగదీశాడు

Submitted on 13 April 2019
Daily wage worker shocks crowd with his English speaking skills

పేరుకు అతడు రోజువారీ కూలీ. దేశంలో నిరుద్యోగ సమస్యపై ఇంగ్లీష్ లో స్పీచ్ దంచేశాడు. ఉద్యోగ సమస్యలపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆ కూలీ దిమ్మతిరిగేలా బదులిచ్చాడు. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతూ.. రిపోర్టర్ , అక్కడి జనానికి షాక్ ఇచ్చాడు. అప్పటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమయంలో ఉద్యోగాల స్థితిపై ఇప్పటి ఉద్యోగాల స్థితిపై ఏకధాటిగా ఇంగ్లీష్ లో మాట్లాడాడు. 

హిందీలో ప్రశ్న అడిగితే.. ఇంగ్లీష్ లో సమాధానం ఇస్తూ... ఐ వాంట్ టూ వర్క్ అని అన్నాడు. ఇంగ్లీష్.. హా.. యస్.. వై నాట్..? అంటూ బదులిచ్చాడు. కూలీ షాకింగ్ స్పీచ్ విని ఆ రిపోర్టర్ కంగుతిన్నాడు. ఇంతకీ మీరు ఏం చదువుకున్నారని అడిగితే.. తాను గ్రాడ్యువేట్ అని.. బీహార్ భగల్ పూర్ యూనివర్శిటీలో డిగ్రీ పూర్తిచేసినట్టు కూలీ చెప్పాడు. ఉద్యోగం లేక రోజువారీ కూలీగా ఇలా పొట్టబోసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   
Read Also : నెటిజన్లు ఫిదా : నాగిని డ్యాన్స్ తో అదరగొట్టిన సన్నీ లియోన్

Daily wage worker
BIHAR
English speaking skills
Bhagalpur University
daily wage worker  

దేశంలో టిక్ టాక్ యాప్ బ్యాన్ చేయటాన్ని సమర్ధిస్తారా?

Results

అవును
89% (297 votes)
కాదు
11% (38 votes)
Total votes: 335

మరిన్ని వార్తలు