క్యూనెట్ కుంభకోణం కేసు : 60మంది అరెస్ట్ 

Submitted on 11 January 2019
Cuneiform scandal case: 60 arrested IN Cyberabad Police

హైదరాబాద్ : క్యూనెట్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం 60మందిని అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి రూ.2.07 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో క్యూనెట్ మోసగాళ్ల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అతి తక్కువ నగదును డిపాజిట్ చేస్తే భారీగా లాభాలు ఇస్తామంటు మోసం చేసిన క్యూనెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో 60 మందిని అరెస్ట్ చేసిన అధికారులు..రూ.2.07 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. 40 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. ఈ క్రమంలో పలువు బాధితులు తమ గోడు చెప్పుకుని తమకు న్యాయం చేయాలని కోరుతు సైబరాబాద్ కమిషనరేట్ కు క్యూ కడుతున్నారు. 


హాంకాంగ్ అడ్డాగా చేసుకుని భారతదేశంలో క్యూనెట్ సంస్థ మోసాలకు పాల్పడుతున్న మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో క్యూనెట్ వేల కోట్ల కుంభకోణం జరిగింది. మాదాపూర్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో బాధితుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన క్యూనెట్ కుంభకోణం కేసులో ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ క్రీడాకారుడు, పద్మ భూషణ్ అవార్డీ మైఖెల్ ఫరేరాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హాంకాంగ్ కు  చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 'క్యూనెట్' పేరిట భారత్‌లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ నడుపుతోంది. వేల సంఖ్యలో అమాయాలకు మోసం చేసి రూ.1000కోట్ల మేర వసూలు చేశారు. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు క్యూనెట్ మల్టిలెవెల్ స్కామ్‌ను బట్టబయలైంది. నిరుద్యోగ యువతకు కమిషన్లు ఆశచూపి..కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి..కుచ్చుటోపీ పెట్టిన క్యూనెట్ కేటుగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గొలుసుకట్టు విధానం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మించి నట్టేట ముంచిన 58 మంది మోసగాళ్లను అరెస్ట్‌చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 

క్యూనెట్ మోసాలపై ఒక్క హైదరాబాద్‌లోనే 14 కేసులు నమోదయ్యాయి. కర్నాటక, ఏపీ, ఢిల్లీలోనూ కేసులున్నాయి. వీటికి సంబంధించి మంగళవారం మొత్తం 58 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో 51 మందిని, బెంగళూరులో ఐదుగురు, ఏలూరు, ఢిల్లీలో ఒక్కొక్కరి చొప్పును అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో 42 మంది తెలంగాణ, 5 మంది ఏపీకి చెందిన వాళ్లు కాగా..మిగలిన వాళ్లు ఇతర రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు వెల్లడించారు. అరెస్టైన పలువురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలిసింది. 2001 నుంచి వీళ్లు వ్యాపారం చేస్తున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.క్యూనెట్ కుంభకోణంపై ఐదేళ్లుగా పోరాటం చేస్తున్న గుర్మీత్, అనూజలు మాట్లాడుతూ.. క్యూనెట్ నిర్వాహకులు నిజమైన కంపెనీ పేరు మీద కాకుండా నలికీ పేరుతో వ్యాపారాలు చేస్తుంటారనీ..వివాదంలో కంపెనీ ఇరుక్కుని మోసం బయటపడగానే వెంటనే పేరును మార్చేసి మరో కొత్త పేరుతో వ్యాపారంలోకి దిగుతారని తెలపారు.

 

Hong Kong
Delhi
Hyderabad
Queet
Multilevel Marketing
Rs 1
000 crore
Scam

మరిన్ని వార్తలు