ఇదో పిరికి ప్రభుత్వం: ప్రియాంక గాంధీ

Submitted on 16 December 2019
"This Is A Coward Government": Priyanka Gandhi Vadra After Delhi Clashes

కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రియాంక గాంధీ వాద్రా బీజేపీని పిరికి ప్రభుత్వం అని పేర్కొన్నారు. జామియా మిలియా ఇస్లామీయా యూనివర్సిటీ విద్యార్థులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలపై స్పందించారు. దేశవ్యాప్తంగా పౌరసత్వపు బిల్లుపై యూనివర్సిటీల్లో విద్యార్థుల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. 

ట్విట్టర్ ద్వారా 'పోలీసులు యూనివర్సిటీల్లోకి వెళ్లి విద్యార్థులను తీసేస్తున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజల అభిప్రాయాలను వినాలి. అలాకాకుండా విద్యార్థులను, జర్నలిస్టులన వెళ్లగొట్టే విధంగా నార్త్ ఈస్ట్‌ ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్‌లో పిరికిపంద చర్యలకు పాల్పడుతుంది' అని హిందీలో ట్వీట్ చేశారు. 

ప్రధాని మోడీని హెచ్చరించడంలో యువత వెనుకడుగు వేయబోదని వివరించారు. 'ప్రభుత్వం ప్రజలకు భయపడుతుంది. నియంత పాలనతో యువతను శాసించాలని అనుకుంటోంది' అని అభిప్రాయపడ్డారు. 

ఈశాన్య ప్రాంతాల నుంచి అస్సాం వరకూ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల వరకూ పాకింది. దేశంలో ప్రశాంతతను కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనికి బాధ్యతగా వహించి ప్రశాంతతను పునరుద్ధరించాల్సి ఉంది' అని కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

Coward
Government
Priyanka Gandhi Vadra
Delhi Clashes
Priyanka Gandhi
Congress

మరిన్ని వార్తలు