గోల్డ్ రష్ : వామ్మో బంగారం ధరలు

Submitted on 22 February 2020
corona Virus Affect Gold Price High

పది గ్రాముల బంగారం రేటు 50వేలవుతుందా... పరుగులు పెడుతోన్న గోల్డ్ రష్ చూస్తే ఇలానే అన్పిస్తోంది. మరి ఇంత పెరిగిన బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయాలా... కొన్నాళ్లు ఆగాలా ? బులియన్ మార్కెట్లో గోల్డ్ రష్ ప్రారంభమైంది. నాలుగు నెలల క్రితం ఓ రేంజ్‌లో పరుగులు పెట్టిన బంగారం రేట్లకి మళ్లీ ఊపొచ్చింది. కోవిడ్ -19 (కరోనా) కారణంతోనో అంతర్జాతీయంగా అండదండలు లభించడంతోనైతేనేం.. ఇప్పుడు పది గ్రాముల బంగారం 43వేలు దాటేసింది..రానున్న రోజుల్లో 45వేల రూపాయలవుతుందనే అంచనాలు జోరుగా సాగుతున్నాయి.

కరోనా వైరస్ ఎఫెక్ట్‌ పసిడి ధరలపై బాగానే పడింది. గత పది రోజుల్లోనే ఈ వేగం మరీ దూకుడుగా ఉంది.  సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు చైనాని వదిలేసి బంగారం వైపు ఫోకస్ పెట్టడంతో అంతర్జాతీయంగా ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఔన్స్ గోల్డ్ రేటు 1600డాలర్లు దాటి 1611 డాలర్లకి చేరుకుంది. ఇది 2013 నాటి స్థాయికి సమానం.. ఈ జోరు ఇప్పట్లో ఆగదని, ఈ ట్రెండ్ ఇంకొంత కాలం కంటిన్యూ అవుతుందనే బులియన్ ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్తున్నారు.

అంతర్జాతీయ పరిణామాలతో మన దేశంలోనూ పసిడి ధరలు భగభగమంటున్నాయి. దానికి తోడు రానున్న రెండు నెలలు పెళ్లిళ్ల సీజన్ నడవనుంది. దీంతో మన దేశంలోనూ బంగారం ధర గ్రాముకి 43వేలపైనే నడుస్తోంది. గోల్డ్ రష్ కంటిన్యూ కావడానికి కొన్నాళ్లుగా బులియన్ మార్కెట్‌లో పెద్దగా పెరుగుదల లేదని..అందుకే ఆరేళ్ల తర్వాత ఈ జోరు కన్పిస్తుందని నిపుణులు చెప్తున్నారు. 


దీనికి తోడు కరోనా వైరస్ ప్రభావంతో చైనా ఆర్ధిక వ్యవస్థ ఏమేరకు నష్టపోతుందనేది రానున్న నెల రోజుల్లో తేలనుంది. ఇది భారీగా కనుక ఉంటే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అక్కడ్నుంచి బులియన్ మార్కెట్‌వైపు మళ్లించే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాదిలోనే గోల్డ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఔన్స్‌కి 2 వేల డాలర్లకి చేరుతుందని అంచనా. అదే జరిగితే మన దగ్గర కూడా పది గ్రాముల బంగారం ధర 48 వేల రూపాయలకు చేరడం ఖాయం. దీంతో కొద్దిగా రిస్క్ అయినా ఇన్వెస్ట్‌మెంట్ కోసమైతే బంగారం కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read More : మూడు ఫుల్లులు, ఆరు బీర్లు : తూర్పుగోదావరి జిల్లాలో మద్యం మాఫియా

corona virus
Affect
gold price
high
Kovid-19 virus

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు