శ్రీశైలంలో హై టెన్షన్ : తెలంగాణ ఎమ్మెల్యే ఎంట్రీ..ఏపీ సర్కార్ అలర్ట్

Submitted on 21 August 2019
controversy-over-allocation-shops-srisailam-high-tension-ap

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో హైటెన్షన్. దేవస్థానం షాపుల కేటాయింపుల వ్యవహారం వివాదంగా మారింది. వేల కొద్దీ షాపులను కేటాయించటంలో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ.. ఆ పార్టీ అనుసంబంధ సంఘాలైన హిందూ ధార్మిక సంస్థలు చలో శ్రీశైలం ఆందోళనకు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. శివనామ స్మరణతో మారుమోగే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో.. ఇప్పుడు పోలీస్ విజిల్స్ వినిపిస్తున్నాయి.

పోలీసులు భారీగా మోహరించారు. శ్రీశైలంలో 30 యాక్ట్ అమలు చేశారు. దేవాలయానికి వచ్చే వాహనాలకు తనిఖీ చేస్తున్నారు. చౌరస్తాలు, ఆలయ పరిపాలనా భవనం సమీపంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు. సున్నిపెంటలో బీజేపీ కార్యకర్తలను, హిందూ సంఘాల ప్రతినిధులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

పలు పుణ్యక్షేత్రాల్లో షాపులు నిర్వహిస్తూ వేల మంది ఉపాధి పొందుతుంటారు. ఈ క్రమంలో శ్రీశైలంలో షాపుల కేటాయింపులో అన్యమతస్తులకు కూడా కేటాయించటం వివాదంగా మారింది. అన్ని మతాల వారికీ ఈవో శ్రీరామ చంద్రమూర్తి షాపుల కేటాయింపు ఉంటుందని భావించారు. అలా జరగలేదు. షాపుల కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. షాపుల కోసం వేసిన టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈవో శ్రీరామ చంద్రమూర్తిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామారావును నియమించింది. 

ఈవో శ్రీరామచంద్రమూర్తి హయాంలో గత సంవత్సం నుంచి వివాదాలు నెలకొన్నాయనే ఆరోపణలు వచ్చాయి. శ్రీశైలం కొండపై అన్యమత ప్రచారం జరుగుతోందనే ఆరోపణలు వచ్చాయి. పండితులకు ఈవోకు పలు విషయాలో వివాదాలు కూడా జరిగాయి. దీంతో శ్రీరామచంద్రమూర్తికి బదిలీ.. రామారావుకు బాధ్యతల్ని అప్పగించింది. ప్రస్తుతం రామారావు మల్లిఖార్జునస్వామిని దర్శనం చేసుకున్న అనంతరం బాద్యతల్ని చేపట్టనున్నారు. అనంతరం ఈవివాదంపై స్పందించే అవకాశమున్నట్లుగా సమాచారం. 

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ ఆందోళనలో పాల్గొంటానని ప్రకటించటంతో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముగ్గురు డీఎస్పీలు, 15మంది సీఐలు, 50మంది ఎస్సైలతో లగాలను శ్రీశైలానికి తరలించింది. శ్రీశైలంలో హై టెన్షన్ నెలకొంది.


మరిన్ని వార్తలు