బాల్ ఠాక్రేపై మాజీ ఎంపీ వ్యాఖ్యలు : సింగర్ సోను నిగమ్ హత్యకు కుట్ర

Submitted on 16 January 2019
Controversial comments by former MP Nilesh Rane on Bal thackeray

ప్రముఖ గాయకుడు సోను నిగమ్ హత్యకు బాల్ ఠాక్రే కుట్ర 
బాల్ ఠాక్రేపై నీలేశ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు
శివసేన, కాంగ్రెస్ ల మాటల యుద్ధం
నీలేశ్ వ్యాఖ్యలపై దుమారం 

మహారాష్ట్ర : మాజీ సీఎం కుమారుడు బాల్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు నారాయణ్‌ రాణే  కుమారుడు మాజీ ఎంపీ అయిన నీలేశ్‌రాణే  శివసేన వ్యవస్థాపకుడు..దివంగత నేత అయిన బాల్ ఠాక్రే ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ ను ఓ సందర్భంలో హత్య చేయించాలని అనుకున్నారంటు సంచనల వ్యాఖ్యలు చేశారు. 
కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శివసేన నాయకుడు వినాయక్‌ రౌత్‌ మాట్లాడుతు..ఒకప్పటి శివసేన నాయకుడైన నారాయణ్‌ రాణే (మాజీ సీఎం)పై  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన నీలేశ్‌ తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే సహించననీ..తాను నోరు విప్పితే..బాల్ ఠాక్రే పరువు పోతుందని..బాల్ ఠాక్రే బ్రతికి వున్న రోజుల్లో ఓ సందర్భంగా ప్రముఖ గాయకుడు సోను నిగమ్ హత్యకు కుట్ర పన్నారంటు వ్యాఖ్యల బాంబ్ పేల్చారు.తాను ఎప్పుడు బాల్ ఠాక్రే సాహెబ్‌ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదనీ..తన తండ్రి నారాయణ్‌ రాణే గురించి తప్పుగా మాట్లాడినందు వల్లనే ఈ విషయం బైట పెట్టాల్సి వచ్చిందని నీలేశ్ తెలిపారు. సోనూ నిగమ్‌ను చంపించాలనుకున్నారు. అలాగని ఠాక్రే కుటుంబానికి, సోనుకు ఏమిటి సంబంధం? అని నన్ను అడగొదనీ..అదంతేననీ నీలేశ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నా తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే ఇలాంటి విషయాలు చాలా బయటపెడతానని హెచ్చరించారు నీలేశ్‌.

శివసేన పార్టీలో ఉన్న సమయంలో నీలేశ్‌ తండ్రి నారాయణ్‌ సీఎంగా పనిచేశారు. ఠాక్రే మరణం అనంతరం బాల్ ఠాక్కే కుమారుడు ఉద్ధవ్‌ నారాయణ్ రాణేను పార్టీ నుంచి తొలగించడంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి రాణే కుటుంబానికి, శివసేకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న క్రమంలో నారాయణ రాణేపై శివసేన నేతలు వ్యాఖ్యలకు నీలేశ్ ఇచ్చిన కౌంటర్ కామెండ్స్ తో ఇప్పుడు దుమారం రేగుతోంది.

 

మరిన్ని వార్తలు