నిను వీడని నీడను : హైదరాబాద్ వీధుల్లో లక్ష సీసీ కెమెరాలు

Submitted on 16 October 2019
to control trafic hyderabad police arranging lakh of cc camaras

ఎక్కడికి వెళుతున్నారో.. ఏం చేస్తున్నారో ఇక నుంచి అబద్ధం చెప్పలేరు.. ఒకవేళ అబద్దం చెప్పినా ఇట్టే కనిపెట్టేయొచ్చు. ఇంట్లో నుంచి బయటకు కాలు పెడితే చాలు.. మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అద్భుతం, అవునా అని ఆశ్చర్యానికి ఇక్కడ తావులేదు. ఎందుకంటే ఇది నిజం కాబట్టి. హైదరాబాదీలు అంటూ ఇక నుంచి సీసీ కెమెరాల నిఘాలో ఉండనున్నారు. సిటీ వ్యాప్తంగా రోడ్లపై లక్ష సీసీ కెమెరాల ఏర్పాటే ఇందుకు కారణం. 10 మంది పోలీసులు చేసే పనిని ఒక్క సీసీ కెమెరా చేయబోతున్నది. సిటీలో చీమ చిటుక్కు అన్నా ఇట్టే తెలిసిపోతుంది. మిమ్మల్ని నీడలా వెంటాడనున్న సీసీ కెమెరా నుంచి తప్పించుకోవటం కష్టం అంటున్నారు పోలీసులు.

ఏయే ప్రాంతంలో ఎన్ని కెమెరాలు :
 సిటీ వ్యాప్తంగా రోడ్లపై సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు, కార్పోరేట్ సంస్ధలు, స్ధానికులు సహాకారంతో మెుత్తం లక్ష కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. స్ధానికుల సహయంతో 13వేల 846 సీసీ కెమెరాల చెప్పున.. మాదాపూర్ లో 5వేల 286, బాలానగర్ లో 4వేల 058, శంషాబాద్ లో 4వేల 352, ఐటీ కారిడార్ లో 150 ఏర్పాటు చేశారు. కార్పోరేట్ సంస్ధలు మాదాపూర్ లో 43వేల 692, బాలానగర్ లో 22వేల 733,శంషాబాద్ లో 20వేల 244 కెమెరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. నేను సైతం ప్రాజెక్టు కింద ఈ ప్రక్రియ జరుగుతుంది. డిసెంబర్ కల్లా లక్ష కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్న సమయం కంటే ముందే లక్ష్యాన్ని చేరుకోవటం విశేషం.

కంట్రోల్ రూంకి అనుసంధానం :
హైదరాబాద్ సిటీ వీధుల్లో ఏర్పాటు చేసిన లక్ష సీసీ కెమెరాలను కంట్రోల్ రూంకి కనెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి మానిటరింగ్ ఉంటుంది. దొంగతనాలు, దోపిడీలు జరిగిన సమయంలో విచారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా సిటీలో ట్రాఫిక్ రద్దీ సమయాల్లో సూచనలు, సలహాలతో వాహనదారులకు సమాచారం అందించనున్నారు. శాంతిభద్రతల విషయంలోనే కాకుండా ఇతర అంశాల్లోనూ సీసీ కెమెరా సేవలను ఉపయోగించుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇతర శాఖల సమన్వయంతో సమాచారం మార్పిడి చేసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఓ నగరంలో లక్ష సీసీ కెమెరాలతో శాంతిభద్రతలను పర్యవేక్షించటం ఇదే ఫస్ట్ టైం అంటోంది పోలీస్ శాఖ.


మరిన్ని వార్తలు