సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విశ్వాసం ట్రైలర్

Submitted on 31 December 2018
Viswasam - Official Trailer [Tamil] -10TV

తళ అజిత్, నయనతార జంటగా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతున్న మూవీ, విశ్వాసం. వీరం, వేదాళం, వివేగం తర్వాత, అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో రాబోతున్న నాలుగవ సినిమా ఇది. ఇంతకుముందు రిలీజ్ చేసిన అజిత్ లుక్స్‌కీ, టీజర్ అండ్ సాంగ్స్‌కీ భారీ రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా విశ్వాసం తమిళ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. విడుదల చేసిన అతి తక్కువ టైమ్‌లోనే రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్‌లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఈ ట్రైలర్. కేవలం 24 గంటల్లో, 14.1 మిలియన్ల వ్యూస్, 1.2 మిలియన్ల లైక్స్‌తో, సౌత్ ఇండియాలోనే కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని అజిత్ ఫ్యాన్స్ అరిచి మరీ చెప్తున్నారు.

ప్రతి నిమిషం సరైన అప్ డేట్స్ ఇస్తూ, సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నారు తళ వీరాభిమానులు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో, ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న విశ్వాసంలో అజిత్ డ్యుయెల్ రోల్ చేసాడు. జగపతి బాబు స్టైలిష్ విలన్‌గా కనిపించబోతున్నాడు. డి.ఇమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా, జనవరి 10న, తమిళనాట విశ్వాసం గ్రాండ్ గా రిలీజవబోతోంది.

వాచ్ విశ్వాసం తమిళ ట్రైలర్...

Viswasam
Viswasam - Official Trailer
Ajith Kumar
Nayanthara
Jagapathi Babu
Vivek
Thambi Ramiah
Yogi Babu
Robo Shankar
Kovai Sarala
Sathya Jyothi Films
Siva

మరిన్ని వార్తలు