బుధవారం కలుద్దాం : రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ రగడ

Submitted on 31 December 2018
Triple Talaq Bill  : Rajya Sabha Adjourned | 10TV

ఢిల్లీ : లోక్ సభలో ఆమోదం పొందింది..ఇక రాజ్యసభలో ఆమోదం పొందాలి...బిల్లు ఆమోదం పొందుతుందని బీజేపీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. కాంగ్రెస్ దానికి మోకాలడ్డుతోంది. ముస్లిం మహిళల హక్కు కోసమంటూ బీజేపీ తీసుకొచ్చిన ‘తలాక్ బిల్లు’ లోక్ సభలో ఆమోదం పొంది రాజ్యసభ మెట్లు ఎక్కింది. ఇక పెద్దలు దీనిని ఆమోదింప చేయాల్సి ఉంది. అయితే...బిల్లులో అభ్యంతరకర అంశాలున్నాయంటూ కాంగ్రెస్ వాదులాటకి దిగుతోంది. ఇంకేముంది...రాజ్యసభ వాయిదా...లు..పడుతూనే ఉంది. ఇక ప్రయోజనం లేకపోవడంతో బుధవారానికి వాయిదా పడింది. 


మండిపడుతున్న ప్రతిపక్షాలు...
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి...రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదు. తలాక్ బిల్లును జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపాల్సిందేనని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. ఈ మేరకు చేసిన తీర్మానంపై ఇప్పటికే 11 పార్టీలు సంతకాలు చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ముందు ఈ తీర్మానంపై ఓటింగ్ జరపాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటింగ్ జరిపమని..చర్చ మాత్రం చేద్దామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రెండు పక్షాలూ తమ సభ్యులకు విప్ కూడా జారీ చేసి మరీ సభకు వస్తున్నాయ్. కాంగ్రెస్ మాత్రం సభలో బిల్ పాసయ్యే వీలే లేదని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కోరుతున్న సవరణలు చేస్తే..ఆ క్రెడిట్ వాటికి దక్కుతుందని బిజెపి..బిల్ తీసుకొచ్చిన ఘనత బిజెపికి దక్కకూడదని విపక్షాలు గేమ్ ఆడుతుండటంతో..అసలు ఈ సమావేశాల్లో తలాక్ చట్టం రూపొందుతుందో లేదో అనుమానంగా మారింది. 

Triple Talaq bill
triple talaq bill rajya sabha
rajya sabha live
triple talaq congress
congress rajya sabha

మరిన్ని వార్తలు