తిరుగులేని కెప్టెన్ : విదేశాల్లో రికార్డ్ విజయాలు

Submitted on 31 December 2018
Team India Captain, Virat Kohli, Kohli serial records in foreign states, Boxing day test victory

వరుస రికార్డులతో చరిత్ర తిరగరాస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సాధించాడు. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఇప‍్పటివరకూ విదేశాల్లో 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 11 విజయాలు సాధించాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో గెలుపు తర్వాత టాప్‌లో నిలిచాడు.

విదేశాల్లో గంగూలీ కెప్టెన్సీలో 28 టెస్టుల్లో 11 విజయాలు సాధించాడు. కోహ్లి మాత్రం 24 టెస్టుల్లోనే ఆ గెలుపు మార్కును చేరుకోవడం విశేషం. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో గంగూలీ, కోహ్లిల తర్వాత ధోని(6), రాహుల్‌ ద్రవిడ్‌(5)లు ఉన్నారు. ఆసీస్‌తో థర్డ్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలిసారి బాక్సింగ్‌ డే టెస్టులో విక్టరీ కొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది.

భారత క్రికెట్ జట్టు మరో ఘనత సాధించింది. విదేశీ టెస్టుల్లో(ఆసియా ఖండం వెలుపల) ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాల్ని నమోదు చేసింది. ఈ ఏడాది నాలుగు విదేశీ టెస్టు విజయాల్ని భారత్‌ సాధించింది. 2018 ఆరంభంలో సౌతాఫ్రికాతో జోహనెస్‌బర్గ్‌లో, ఇంగ్లండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌లను భారత్ గెలిచింది. ఆసీస్‌తో ప్రస్తుత సిరీస్‌లో అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ టెస్టుల్లో భారత్ విక్టరీ కొట్టింది. ఈ విజయాలతో 1968లో న్యూజిలాండ్‌పై వారి దేశంలో గెలిచిన టెస్టు మ్యాచ్‌ల రికార్డును భారత్‌ మెరుగుపరుచుకుంది.

Team India Captain
Virat Kohli
Kohli serial records in foreign states
Boxing day test victory

మరిన్ని వార్తలు