కాసేప‌ట్లో కాన్పు.. ఖ‌తర్నాక్ డ్యాన్స్‌తో క‌ట్టిప‌డేసింది..

Submitted on 29 December 2018
pregnant woman, dancing with her doctor, before woman delivery, before the surgery 

 ఆమెకు నెల‌లు నిండాయి.. ఇవాళే డెలివ‌రీ టైమ్.. కాసేప‌ట్లో బిడ్డ‌ను కనబోతుంది. టెన్ష‌న్ ఉంటదిగా.. ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ల ఆప‌రేష‌న్‌కు హ‌డావుడి చేస్తున్నారు. ఇంత‌లో ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోకి ఆమెను తీసుకెళ్లారు. ఒక‌వైపు భ‌ర్త టెన్ష‌న్‌.. మ‌రోవైపు..అమ్మాయి త‌ల్లిదండ్రులు టెన్ష‌న్‌.. కాన్పు స‌క్ర‌మంగా జ‌రుగుతుందో లేదో.. ఒక‌టే ఆందోళ‌న..  పుట్టేది అమ్మాయా.. అబ్బాయా.. అని ఒకరు అంటే.. అమ్మాయే కావాల‌ని త‌ల్లిగారు.. వారసుడు కావాల‌ని అత్త‌గారు.. ఎవ‌రైనా ఓకే అని భ‌ర్త‌.. వీరింద‌రిని చూసి డెలివ‌రీ కాబోయే అమ్మాయిలో మ‌రింత టెన్ష‌న్‌.. ఒత్తిడి.. ఏమైనా జ‌ర‌గొచ్చు.. కుటుంబ స‌భ్యుల్లో తీవ్ర ఉత్కంఠ... డాక్ట‌ర్ బ‌య‌ట‌కు ఎప్పుడాస్తాడా.. ఏ షాకింగ్ న్యూస్‌ చెప్తాడా అని.. ఆప‌రేష‌న్ థియేట‌ర్ ముందు కుటుంబ‌మంతా ఎదురుచూపులు.. ఇదంతా కామ‌న్ గా జ‌రిగేదే క‌దా..! మ‌రి ఇక్క‌డ అందుకు భిన్నంగా జ‌రిగిందంటే న‌మ్ముతారా? అవును న‌మ్మాల్సిందే. ఈ వీడియో చూస్తే మీరే చ‌చ్చిన‌ట్టు న‌మ్ముతారు. డెల‌వ‌రీకి ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లోకి వెళ్లిన మ‌హిళ బిడ్డ‌ను క‌న‌డం మాని స్టెప్పులేసింది. మీరు విన్న‌ది నిజ‌మే.. కాసేప‌ట్లో డెలివ‌రీ అయితే డ్యాన్స్ ఎలా చేస్తారు కామెడీ కాక‌పోతే.. అనుకోవ‌ద్దు.

ఇక్కడ విశేషం ఏమిటంటే.. డెల‌వ‌రీ కాబోయే  ఆమెతో పాటు డాక్ట‌ర్లు కూడా చిందులు వేయ‌డం.. స్టెప్పుల్లో స్టెప్పులు క‌లుపుతూ హుషారెత్తించారు. ఏ పాట‌కు అనుకుంటున్నారు.. బాలీవుడ్ 'దిల్ ద‌డ‌క‌నే డూ'  సాంగ్‌కు ఖ‌త‌ర్నాక్ స్టెప్పుల‌తో దుమ్మురేపారు. అంత‌టితో ఆగ‌లేదు.. వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. క్ష‌ణాల్లో వీడియో వైర‌ల్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో స‌రికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. ఇంత‌కీ.. ఇదెక్క‌డ జ‌రిగిందో చెప్ప‌లేదు క‌దూ.. పంజాబ్‌లోని లుథియానాలో జ‌రిగిందట‌.. నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న వీడియోను చూసి నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్ల‌తో అభినందిస్తున్నారు. ప్ర‌స‌వానికి ముందు ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు మంచి ఎక్స‌ర్‌సైజ్.. చ‌క్క‌టి ఆలోచ‌న అంటుంటే.. మ‌రికొంద‌రు.. ఎవ‌రా కొరియోగ్రాఫ‌ర్‌.. డ్యాన్స్ ఇర‌గ‌దీశారు.. అంటూ జోకులు పేలుస్తున్నారు.ఇదే ఆ వీడియో..

Just a few minutes before the C-section delivery, the Doctor and the patient perform a nice jig. This happened in Ludhiana. pic.twitter.com/ZOlzIhbQ8c

— Harsh Goenka (@hvgoenka) December 28, 2018
pregnant woman
dancing with her doctor
before woman delivery
before the surgery 

మరిన్ని వార్తలు