లేబర్ వార్డ్ లో గర్భిణీ స్టెప్స్ : డెలివరీకి వెళ్లి డాక్టర్స్ తో డ్యాన్స్..

Submitted on 1 January 2019
Pregnant Woman Dancing with Doctors Go to Delivery

ఢిల్లీ : డెలివరీ అంటే మహిళకు మరో జన్మ అంటారు. డెలివరీ టైమ్ దగ్గర పడేకొద్దీ గర్భిణి కొంచెం ఆందోళనకు గురవవ్వటం..దీంతో బీపీ లెవెల్స్ పెరగటం మామూలుగా జరిగేదే. కానీ నేటి టెక్నాలజీ ట్రెండ్స్ లో డాక్టర్స్ కూడా ట్రెండ్స్ ఫాలో అవుతు..డెలివరీ సమయంలో ఈజీగా వుండేందుకు ఆ ఒత్తిడి పోగొట్టేందుకు ట్రై చేస్తున్నారు.
ఈ క్రమంలో కొంతమంది డాకర్లు 'డ్యాన్స్' మంత్రాను ఫాలో అవుతున్నారు. గర్భిణీ స్త్రీలతో ఈజీగా వుండే చిన్న చిన్న డ్యాన్స్ ఐటెమస్ చేయిస్తున్నారు. దీంతో ఒత్తిడి దూరమై డెలివరీ ఈజీ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు ఈ ట్రెండ్లీ డాక్టర్స్. ఈ డ్యాన్స్ తో వారికొక రిలాక్సేషన్ కల్పిస్తున్నారు.
ఈ క్రమంలో సంగీత శర్మ అనే గర్భిణీ స్త్రీతో ఓ డాక్టర్ స్టెప్పులు వేయించిన వీడియో ఇప్పుడు  వైరల్‌గా మారింది. సదరు గర్భిణీ స్త్రీ మంచి కొరియోగ్రాఫర్ కూడా. ఇంకేముంది..లేబర్ రూమ్‌లో ఆకట్టుకునే స్టెప్స్ వేసి డ్యాన్స్ అదరగొట్టేసింది. సంగీతకు జతగా మరో డాక్టర్‌ కూడా జత కలిసింది. సంగీతతో డాక్టర్ వేయించిన స్టెప్పులేసిన వీడియోను నెటిజెన్స్ విరగబడి చూస్తున్నారు. సిజేరియన్‌ ఆపరేషన్ కు ముందుకు ఆమెలో ఒత్తిడిని దూరం చేసేందుకు చేస్తున్న ఇటువంటి ట్రెండ్లీ టెక్నిక్స్ మంచి ఫలితాలను ఇస్తున్నాయంటున్నారు డాక్టర్స్. 
ఇది తనకు రెండో ప్రెగ్నెన్సీ అని.. ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ  అవగా.. రెండవ సారి సిజేరియన్ పడుతుందని డాక్టర్స్ చెప్పారనీ..ఫస్ట్ టైమ్ ఆపరేషన్ అనేసరికి టెన్షన్ వచ్చిందనీ దీంతో సీ-సెక్షన్ డెలివరీకి వెళ్తుండటంతో.. ఆపరేషన్‌కు కొద్ది నిమిషాల ముందు రిలాక్సేషన్ కోసం డాక్టర్‌తో కలిసి డ్యాన్స్ చేసినట్టు సంగీత తెలిపారు. 
సంగీత శర్మ లాగే అందరు దీన్ని ఫాలో అవ్వకూడదనీ..డాక్టర్స్ అడ్వయిజ్ తోనే చేయాలని దీన్ని అందరు ఫాలో అవ్వకూడదని స్పష్టం చేశారు సదరు డాక్టర్స్. లేదంటే ప్రమాదం జరిగే అవకాశాలు చాలా వుంటాయని హెచ్చరిస్తున్నారు. 

 

Pregnant Women
Musical Sharma
Delivery
Labor Ward
Doctors
social media
viral

మరిన్ని వార్తలు