ఆరెంజ్ అలర్ట్ : తెలుగు రాష్ట్రాల్లో చలి తుఫాన్

Submitted on 1 January 2019
Orange Alert: Cold waves in Telugu states

హైదరాబాద్  : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ  ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.  ఇప్పటికే చలి పులి ధాటికి నగర వాసులు వణికిపోతున్నారు. దీంతో మరో ఐదు రోజుల పాటు ఇదేస్థాయిలో చలి వణికించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో తీవ్రమైన చలిగాలలు వీస్తాయనీ.. ఆంధ్రప్రదేశ్ లో తెలిపిన ఐఎండీ తెలంగాణలో నారింజ రంగు హెచ్చరికలను, ఏపీకి పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఆరెంజ్ కలర్ ను చలి తీవ్రత తగ్గితే ఎల్లో కలర్ తో వాతావరణ శాఖ నమోదు చేస్తోంది. హైదరాబాద్ స్టేట్ డెవెలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్డిఎస్పి) వద్ద రికార్డ్ అయిన వాతావరణ ఫలితాల ప్రకారం  6.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది డిసెంబర్ 21, 2010 న హైదరాబాద్ లో వాతావరణ విభాగం చేత 8.9 డిగ్రీ సెల్సియస్ ల అత్యల్ప ఉష్ణోగ్రతగా నమోదయ్యింది. 

IMD వారి వాతావరణ హెచ్చరికలో ఎనిమిది జిల్లాలకు నారింజ హెచ్చరిక జారీ చేసింది. జనవరి 2,3 తేదీల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కు తగ్గిపోవచ్చని అంచనా వేశారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ గ్రామీణ, మెదక్, పెడపల్లి, కొమరంబీం, మంచిర్యాలలో చలి ఎక్కవ స్థాయితో ఉండటంతో ఈ జిల్లాల్లో నారింజ హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. 

3 నుండి 5 తేదీల వరకూ కొన్ని జిల్లాలకు చల్లని గాలులు వీచే క్రమంలో పసుపు హెచ్చరిక జారీ అయ్యాయి.  ఆసిఫాబాద్, నిర్మల్, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, కమరెడ్డి, సిద్దిపేట్, భూపాల్పల్లి, వరంగల్ (అర్బన్), నిజామాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలలో చలిగాలులు తీవ్రంగా వీస్తాయి. 

ఆదిలాబాద్ లోని అర్లీ గ్రామంలో 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వగా ఆసిఫాబాద్ మరియు ఆదిలాబాద్ రెండు ఉష్ణోగ్రతలు 2 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ మధ్య మారుతూ వచ్చాయి. వరంగల్, రామగుండం జిల్లాలు కూడా 9 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ, తదుపరి ఐదు రోజులు వర్షపాతం ఉండదని IMD తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ వెంట జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. 

AP
Telangana
IMD
Cold waves

మరిన్ని వార్తలు