న్యూ ఇయర్ గిఫ్ట్ : మహిళలకు మాత్రమే

Submitted on 1 January 2019
New Year gift to fly maid for women employees In Mumbai

కోల్‌కతా : కొత్త సంవత్సరంలో ఫ్లై మైబిజ్ సంస్థ మహిళా ఉద్యోగుల కోసం సరికొత్త కానుక ఇచ్చింది. నెలసరి సమయంలో మహిళా ఉద్యోగుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు..చెప్పుకోలేరు..శారీరకంగా..మానసికంగా నలిగిపోతు..ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇటు ఆఫీస్ పనులు...అటు ఇంటి పనులలో తీవ్రమైన అలసటకు గురవుతుంటారు మహిళా ఉద్యోగులు. దీనిపై ఆలోచించినన ఫ్లై మైబిక్ సంస్థ నెలసరి రోజుల్లో మహిళా ఉద్యోగులకు సెలవు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం సాధారణ సెలవులతో పాటు ప్రతీ నెలా అదనంగా మరో సెలవును ఇవ్వనున్నట్టు వెల్లడించింది. 
మహిళా ఉద్యోగులు బాగుంటేనే తమ సంస్థ కూడా బాగుంటుందనే ఉద్ధేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని..2019, జనవరి 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని..సంవత్సరంలో మరో 12రోజులు వారికి అదనపు సెలవులు ఇవ్వబోతున్నామని . ఉద్యోగులను సంతోషపరచడం మా బాధ్యత. వాళ్లు బాగుంటేనే సంస్థ బాగుంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని  ఫ్లై మైబిజ్ సీఈవో సామ్యో దత్తా తెలిపారు. 
చాలామంది సరైన అవగాహన లేక నెలసరి గురించి మాట్లాడటాన్ని ఇప్పటికీ అదేదో తప్పు లాగే చూస్తారని..నెలసరి సమస్యలకు తోడు మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో వున్నయన్నారు. సోషల్ మీడియాలో ఏవో రెండు కామెంట్స్ పోస్ట్ చేసి సానుభూతి ప్రకటించకుండా.. వారికి అండగా నిలబడాలన్న ఆలోచనలో భాగంగా నెలసరి సెలవులపై నిర్ణయం తీసుకున్నట్టు సామ్యో దత్తాత తెలిపారు. ఈ క్రమంలో ముంబైకి చెందిన రెండు కంపెనీలు ఇప్పటికే నెలసరి సెలవులను ఇస్తుండగా..ఇప్పుడు  మూడో సంస్థగా ఫ్లై మైబిజ్ చేరింది.
 

Mumbai
Maharashtra
2019
new year
Gift
Mens Day
Holiday
Fly Mobiez
Company
CEO
Samayo Datta

మరిన్ని వార్తలు