జెర్సీ ఫస్ట్ లుక్

Submitted on 31 December 2018
Natural Star Nani Jersey First Look-10TV

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధ శ్రీనాధ్, రెబా మోనికా జాన్ హీరో, హీరోయిన్స్‌గా, మళ్ళీ రావా సినిమా‌తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న సినిమా, జెర్సీ.. పిడివి ప్రసాద్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. నూతన సంవత్సరం సందర్భంగా, జెర్సీ నుండి నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

జెర్సీలో నాని, అర్జున్ అనే క్రికెటర్ క్యారెక్టర్ చేస్తున్నాడు.  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నాని, ఒత్తైన జుట్టు, ఫుల్ గెడ్డంతో రఫ్‌గా కనిపిస్తున్నాడు. నాని కూర్చుని ఉంటే, అతని చుట్టూ టీమ్ మెంబర్స్ నిలబడి ఉన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జెర్సీ టీమ్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు..  2019 ఏప్రి‌ల్‌లో జెర్సీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Natural Star Nani Jersey First Look

 

 

Jersey
Jersey first look
Natural Star Nani
Shraddha Srinath
Reba Monica John
Anirudh Ravichander
Goutham Tinnanuri
Sithara Entertainments

మరిన్ని వార్తలు