నరేంద్ర మోదీ బయోపిక్‌ రాబోతుంది

Submitted on 29 December 2018
Narendra Modi, Narendra Modi Biopic, Bollywood, Actor Vivek Oberoi, modi biopic

బాలీవుడ్‌లో మరో బయోపిక్‌కి రంగం సిద్ధమవుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇంతకుముందు గాంధీ, ఇందిరా గాంధీల బయోపిక్స్ వచ్చాయి. గతకొంత కాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా కొనసాగుతుంది. మన టాలీవుడ్‌లో, మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి విజయంతో, బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.

వై.ఎస్.ఆర్ జీవితం ఆధారంగా యాత్ర సినిమా రూపొందుతుంది. రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ లైఫ్ స్టోరీతో లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలు తియ్యబోతున్నాడు. మరోవైపు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లోనూ కొన్ని బయోపిక్‌లు రూపొందనున్నాయి. నరేంద్ర మోదీ బయోపిక్‌లో ఆయన క్యారెక్టర్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించనున్నాడని తెలుస్తుంది. 

వివేక్ ఒబెరాయ్ తెలుగులో రామ్ చరణ్ వినయ విధేయ రామలో విలన్‌గా నటించాడు. సంజయ్ దత్ భూమి సినిమాని డైరెక్ట్ చేసిన ఒమంగ్ కుమార్ ఈ బయోపిక్‌కి డైరెక్టర్. ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. 2019లో నరేంద్ర మోదీ బయోపిక్ లాంచ్ అవబోతుంది.

Narendra Modi
Narendra Modi Biopic
Bollywood
Actor Vivek Oberoi
modi biopic

మరిన్ని వార్తలు