మోడీ ఏపీ పర్యటన వాయిదా

Submitted on 28 December 2018
Narendra Modi AP Tour, Modi tour Postponed, Modi AP Tour, Kanna Laxmi Narayana

ఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం.. జనవరి  మొదటి వారంలో  మోడీ.. ఏపీలో పర్యటించాల్సి ఉంది. జనవరి 6న మొదట కేరళలో మోడీ ప‌ర్య‌టించనున్నారు. అనంతరం ఏపీలో  పర్యటించాల్సి ఉంది.  మోడీ ఏపీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా గుంటూరులో  బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అనుకోకుండా ఏర్పాటైన కార్యక్రమాల వల్ల మోడీ తన పర్యటన వాయిదా వేసుకున్నారు.  జనవరి చివరి వారంలో కాకుండా ఫిబ్రవరి మొదటి వారంలో  ప్రధాని పర్యటన ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. 

వాస్తవానికి  ఈ పర్యటన మొదట తాడేపల్లి గూడెంలో పెట్టాల్సి ఉంది.  పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మి నారాయణ వత్తిడితో గుంటూరుకు మార్చారు. ఇప్పుడు మోడీ గుంటూరు సభ ఏర్పాటు చేస్తే ఏపీకి ఆయన ఏం చేశాడు అనేది చెప్పేందుకు ఏమీ లేదని, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు జరిపి అప్పుడు జరిగే బహిరంగ సభలో ఏపీకి చేసిన మేలుపై మాట్లాడేందుకు వీలు ఉంటుంద‌ని పలువురు సూచించటంతో  మోడీ సభ వాయిదా వేసుకునట్లు తెలుస్తోంది. 

Narendra Modi AP Tour
Modi tour Postponed
Modi AP Tour
Kanna Laxmi Narayana

మరిన్ని వార్తలు