రాయలసీమ బంద్ కు వామపక్షాలు పిలుపు

Submitted on 28 December 2018
Rayalaseema Left Parties, Rayalaseema Bandh, Rayalaseema Farmers issues, CPI, CPM, Drought hit farmers, Farmers Load waiver

కడప : కరవులో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలంటూ ఇవాళ వామపక్షాలు రాయలసీమ బంద్ కు పిలుపు ఇచ్చాయి. కరువు నష్టపరిహారం, రుణమాఫీ అందించాలంటూ వామపక్ష పార్టీలు బంద్ నిర్వహిస్తున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్స్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. డిపో నుంచి బస్సులు బయటికి రాకుండా వామపక్ష నేతలు అడ్డుకుంటున్నారు. భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

కడప జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా బైఠాయించి ధర్నాకు దిగారు. డిపో నుంచి బయటికి రాకుండా బస్సులను అడ్డుకునేందుకు సీపీఎం, సీపీఐ నాయకులు ప్రయత్నించారు. ఏళ్ల తరబడి కరువుతో రైంతాగం అల్లాడుతున్నా ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదని వామపక్ష నేతలు విమర్శించారు. ప్రభుత్వాలు మారిన రైతుల తల రాతలు మారలేదన్నారు. పెండింగ్ లో  ఉన్న సబ్సిడీ రుణాలను రైతుల అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. భారీగా పోలీసు బలగాల మోహరించాయి.

అనంతపురం జిల్లాలో వామపక్ష పార్టీల బంద్ ప్రభావం పాక్షికంగా కనిపిస్తొంది. యధావిధిగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్నాయి. డిపోల వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఎక్కడికక్కడే ఆందోళన కారులను, వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండటం లేదు.

తిరుపతిలో బంద్ ప్రభావం పాక్షికంగా కనిపిస్తోంది. బస్టాండ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బద్వేల్ లో వామపక్షాల బంద్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో సీపీఐ, సీపీఎం నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసుల వారిని అరెస్టు చేశారు.

Rayalaseema Left Parties
Rayalaseema Bandh
Rayalaseema Farmers issues
CPI
CPM
Drought hit farmers
Farmers Load waiver

మరిన్ని వార్తలు