సిడ్నీ టెస్టు : అశ్విన్ డౌటే

Submitted on 2 January 2019
aswin crickter

సిడ్నీ : చారిత్రక విజయం సాధించాలని కోహ్లీ సేన తహతహలాడుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా 2-1 తేడాతో గెలుపొందిన టీమిండియా ఫుల్‌జోష్‌లో ఉంది. చివరిదైన సిడ్నీ టెస్టులో కూడా గెలుపొందాలని కోహ్లీ టీం భావిస్తోంది. 2019, జనవరి 3వ తేదీ గురువారం నుండి చివరి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్టులో ఆడేది ఎవరెవరో పేర్లను బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 13మంది ఉన్నారు. ఈ టెస్టులో భారత స్పిన్నర్ అశ్వన్ ఆడటం అనుమానంగానే ఉంది. ఇటీవలే ఆయన తండ్రైన విషయం తెలిసిందే. బిడ్డను..భార్యను చూసేందుకు ఆయన ముంబైకి వెళ్లాడు. 
బీసీసీఐ ట్వీట్...
అతను ఆడుతాడా ? లేడా ? అనేది గురువారం ఉదయం తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తొలి టెస్టు మ్యాచ్‌లో గాయానికి గురైన అశ్వన్..రెండు..మూడు టెస్టుల్లో కూడా ఆడలేదు. అశ్వన్ స్థానంలో రవీంద్ర జడేజా వచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై కోహ్లీ స్పందించాడు. అశ్విన్ దూరమైతే మాత్రం జట్టుకు పెద్ద దెబ్బేనని..టెస్టు క్రికేట్‌లో అతని పాత్ర కీలకమని కోహ్లీ వ్యాఖ్యానించారు. 
భారత జట్టు : కోహ్లీ, రహానే, రాహుల్, మయంక్ అగర్వాల్, పుజారా, విహారీ, పంత్, జడేజా, యాదవ్, అశ్విన్, షమీ, బుమ్రా, ఉమేష్ యాదవ్. 

India vs Australia
13 Man Squad
Sydney Test
test vs australia
Fourth Test

మరిన్ని వార్తలు