గుడ్ న్యూస్ : సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు..

Submitted on 28 December 2018
Sankranthi festival, Pongal special Trains, Special trains to Telugu States, Sankranthi Holidays

హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో సంక్రాంతి పండుగకు ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందులు తప్పనున్నాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రయాణాలు చేయనున్నారు. 

సికింద్రాబాద్‌–కాకినాడ : సికింద్రాబాద్‌–కాకినాడ సువిధ (నం. 82709) ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 13 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం 6.25కు కాకినాడకు చేరుతుంది. కాజీపేట, ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోటలో హాల్టింగ్‌ కల్పించారు. 

కాచిగూడ–కాకినాడ : కాచిగూడ–కాకినాడ సువిధ (నం. 82724) ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 13 తేదీల్లో రాత్రి 9.15 గంటలకు బయల్దేరి మరునాడు ఉ.7.45 గంటలకు కాకినాడకు చేరుతాయి. మల్కాజిగిరి, కాజీపేట ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకాపూడి, సామర్లకోటలో హాల్టింగ్‌ కల్పించారు.

మచిలీపట్నం–సికింద్రాబాద్‌ రైలు రద్దు : జనవరి 10న మచిలీపట్నం నుంచి బయల్దేరాల్సిన మచిలీపట్నం–సికింద్రాబాద్‌ (నం.07251) ప్రత్యేక రైలును రద్దు చేశారు. 

Sankranthi festival
Pongal special Trains
Special trains to Telugu States
Sankranthi Holidays

మరిన్ని వార్తలు