ట్రాన్స్‌ఫార్మర్ కోసం : కలెక్టర్ కాళ్లు పట్టుకున్న రైతు

Submitted on 31 December 2018
Farmer Plea To Shivpuri Collector  In MP | Farmer touches district collector's feet | 10TV

మధ్యప్రదేశ్ : దేశానికి రైతన్న వెన్నెముక...ఆ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం బాగుంటుంది. రైతుకు ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామని చెప్పి అధికార సీట్లో కూర్చొన్నాక పట్టించుకోవడం మానేస్తుంటారు. దీనితో ఆ రైతన్న ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తుంటాడు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా..ప్రాధేయపడినా కొంతమంది అధికారులు కనికరించరు. 
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని...తద్వార తన సమస్య కొంత తీరుతుందని శివ్‌పురి జిల్లాకు చెందిన అనిల్ జాదవ్ అనే రైతు ఎంతో మంది అధికారులను కోరాడు. ప్రాధేయపడ్డాడు. రోజులు గడుస్తున్నాయి కానీ తన సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అనే చందంగానే ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ రావాలంటే ఏం చేయాలో ఆలోచించాడు. 
శివ్‌పురి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఆ సమయంలో నూతనంగా వచ్చిన కలెక్టర్ అనుగ్రహ్ బయటకు వెళుతున్నారు. ఒక్కసారిగా కలెక్టర్ కాళ్లపై పడ్డాడు. తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. ‘బెహన్ జీ..మేరీ బాత్ సునో’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేతిలో ఎండిపోయిన పంట..కన్నీళ్లు పెట్టుకోవడంతో కలెక్టర్ స్పందించారు. సమస్యను మొత్తం సానుకూలంగా విన్నారు. ఆ రైతన్నకు ధైర్యం చెప్పారు. సమస్యను పరిష్కరిస్తానని...విచారణ చేయిస్తానని హామీనిచ్చి కారులో వెళ్లిపోయారు. 

#WATCH Shivpuri(Madhya Pradesh): A farmer breaks down and falls to the feet of the newly appointed Collector Anugrah P seeking her intervention for installation of a new transformer in his village. The transformer was installed later. (28.12.18) pic.twitter.com/GPOe3ydnv4

— ANI (@ANI) December 31, 2018
Farmer's plea
district collector Farmer breaks down
Collector Anugrah P
new transformer
Shivpuri in Madhya Pradesh

మరిన్ని వార్తలు