సాంగ్‌లో రెచ్చిపోయారు బ్రదర్స్

Submitted on 19 December 2018
f2 movie super dance by venkatesh and varun tej

విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ అనేది ట్యాగ్ లైన్.. మొన్న రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్‌ని ఎంటర్ టైన్ చేస్తూ, హైయ్యెస్ట్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇప్పుడు ఎఫ్2 నుండి ఫస్ట్‌సాంగ్ టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఒక నిమిషం, ఇరవై సెకన్ల డ్యూరేషన్ ఉన్న ఫస్ట్‌సాంగ్ టీజర్ సూపర్బ్‌గా ఉంది. ఫారిన్‌లో బ్యూటిఫుల్ లొకేషన్లలో, అందాల భామలతో కలిసి, వెంకీ, వరుణ్ చేసిన ఎంజాయ్ మామూలుగా లేదసలు. ఇక వీళ్ళకి నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ యాడ్ అయ్యే సరికి జోష్ ఇంకాస్త పెరిగింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చెయ్యగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా, డేవిడ్ సిమన్ అంతే బాగా పాడాడు. క్రికెట్ ఆడే బంతికి రెస్టే దొరికినట్టు ఉందిరో, 1947 ఆగష్ట్ 15ని నేడే చూసినట్టు ఉందిరో, రెచ్చిపోదాం బ్రదర్.. అంటూ సాగే ఎఫ్2 ఫస్ట్‌సాంగ్ టీజర్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. వెంకీ, వరుణ్‌లు తోడల్లుళ్ళుగా కనిపించబోతుండగా, వారికి జంటగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా2019 జనవరి 12న ఎఫ్2 రిలీజ్ కానుంది.    


మరిన్ని వార్తలు