'మన్మోహన్' బ‌యోపిక్ ట్రైలర్‌పై రాజ‌కీయ‌ దుమారం

Submitted on 29 December 2018
The Accidental Prime Minister, Indian biographical political film, Vijay Ratnakar Gutte, Anupam Kher

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ట్రైలర్‌ రిలీజ్‌తోనే ఈ మూవీపై దుమారం రేగింది. సినిమా చుట్టూ  వివాదాలు నెలకొన్నాయి. తమ పార్టీపై బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఈ సినిమా నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల బాధితుడు మన్మోహన్ సింగ్ అన్న సందేశాన్ని పంపించేలా ఈ సినిమా ట్రైలర్ ఉన్నట్లు అభిప్రాయపడింది. ఈ సినిమా వెనుక బీజేపీ హస్తమున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అనుపమ్‌ ఖేర్‌ టైటిల్‌ పాత్రను పోషించిన ఈ సినిమాపై మహారాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు ముందు తమకు ప్రీ రిలీజ్‌ షో వేయాలని, లేకుంటే చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

రిలీజ్‌ కానివ్వమని వార్నింగ్:
వాస్తవాలు వక్రీకరించి రూపొందించిన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. ట్రైలర్‌ను పరిశీలిస్తే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీలకు సంబంధించి దుష్ప్రచారం చేసేలా సినిమా ఉంటుందనే సంకేతాలు వెల్లడవుతున్నాయని, ఇది తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్  స్పష్టం చేసింది. తమ కార్యవర్గ సభ్యులకు ముందస్తుగా సినిమాను ప్రదర్శించి, తాము సూచించే మార్పులను చేపట్టకుంటే దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ 2018, డిసెంబర్ 27 గురువారం ముంబైలో విడుదలైంది. మన్మోహన్‌సింగ్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

The Accidental Prime Minister
Indian biographical political film
Vijay Ratnakar Gutte
Anupam Kher

మరిన్ని వార్తలు