కేసీఆర్ నయా సాల్ : ప్రాజెక్టుల బాట

Submitted on 31 December 2018
CM KCR Visit Telangana Project Works from january 1st | 10TV

కరీంనగర్ : సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టేందుకు ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ నడుం బిగించారు. జనవరి 1వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేస్తున్నారు. తెలంగాణను సస్యశ్యామలంగా మారుస్తానని..కోటి ఎకరాలకు నీరందిస్తానని చెప్పిన కేసీఆర్...అందుకనుగుణంగా ప్రధానమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రిగా డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి సీఎం కెసిఆర్ రెడీ అయ్యారు. జనవరి 1, జనవరి 2వ తేదీన కేసీఆర్ పర్యటన ఇలా కొనసాగనుంది.

  • జనవరి 1న ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా కాళేశ్వరం...మేడిగడ్డ బ్యారేజి వద్దకు చేరుకుని బ్యారేజి పనులను పరిశీలిస్తారు.  మధ్యాహ్నం 1.50 కి మేడిగడ్డ నుంచి బయల్దేరుతారు. 
  • 2 గంటలకు కన్నెపల్లి పంప్ హౌజ్ చేరుకుంటారు. 
  • భోజన అనంతరం 3 గంటలకు బయల్దేరి 3.10 నిమిషాలకు అన్నారం బ్యారేజి వద్దకు చేరుకుంటారు. 
  • 3.30 గంటలకు బ్యారేజి నిర్మాణంపై సమీక్ష. 
  • 3.45కు సుందిళ్ల బ్యారేజిని పరిశీలిస్తారు. 
  • 4.05 నిమిషాలకు గోలివాడ పంప్ హౌజ్ పనుల పరిశీలన. 
  • జనవరి 2న ఉదయం 10.30 గంటలకు తీగలగుట్టపల్లి నుంచి హెలికాప్టర్‌లో పయనం. 
  • రాజేశ్వర్‌రావు పేట పంప్ హౌజ్ చేరుకుని అక్కడ పనులను పరిశీలిస్తారు. 
  • 11.45 నిమిషాలకు మల్యాల మండలం రాంపూర్ చేరుకుని అక్కడ జరుగుతున్న పంప్ హౌజ్ పనులను పరిశీలన. 
  • మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ పయనం. 
karimnagar kaleshwaram
karimnagar kaleshwaram project. kcr tour schedule
kcr live karimnagarm

మరిన్ని వార్తలు